కొత్తకండ్రిగలో ఆగని టీడీపీ మూకల వీరంగం
వైఎస్సార్‌సీపీ వారిపై దాడి..
ఐదుగురికి తీవ్ర గాయాలు
బాధితులపైనే కేసుకట్టి జైలుకు పంపిన పోలీసులు
బాధితుల ఫిర్యాదు తీసుకోని వైనం
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ నాయకుడు గున్నయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సురేష్, అతడి బావ రాజయ్య, మామ వెంకటయ్య, మరికొందరు ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడిచేశారు. విజయకుమార్, గురునాథ్, చిట్టెమ్మ, బాబు, సుధాకర్‌లను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. బాధితులు ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకువచ్చారు.
టీడీపీ నేతల ఒత్తిడితో టీడీపీ వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఆస్పత్రిలో చేరకుండా అడ్డుకుని వారిని తీసుకెళ్లి రాత్రంతా స్టేషన్‌లో ఉంచారు. సోమవారం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసి న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి సబ్‌జైలుకు పంపారు. తీవ్రంగా గాయపడిన చిట్టెమ్మ ఇచి్చన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదుచేయలేదు. దీనిపై డీఎస్పీని అడగగా.. విచారించి కేసు నమోదుచేస్తామని తెలిపారు.
ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైననాటో డ్రైవర్ ఎర్రయ్యను హత్యచేసేందుకు టీడీపీకి చెందిన సురే‹Ù, మరికొంతమంది ప్రయతి్నంచారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయారు. 20వ తేదీన ఎర్రయ్య తొట్టంబేడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి సాధారణ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని టీడీపీ నాయకులను వదిలేశారు.
ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు..
» కూటమి నేతలు ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తున్నారు
» ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా గారపాడు మహిళల ఫిర్యాదు
నగరంపాలెం: కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ ల నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలోని పల్లెలో ఉంటున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము గ్రామంలో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు చెందిన మహిళలు కూడా తమ ఇళ్లల్లోకి చొరబడి గొడవలకు దిగుతున్నారని, పల్లె విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బాధితులు కూరపాటి పూర్ణ, పల్లపాటి శృతి, ఏసుపొగుల సింధు, మహాలక్షి్మ, కోటేశ్వరి, బేతపూడి రాణి తదితరులు సోమవారం గుంటూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణలో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ వారిని కవి్వస్తున్నారు.
అధికారం మాదే, ఈ ఐదేళ్లు గ్రామంలో ఉండటానికి వీల్లేదు.. వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. గత నెల 26న తాను ఇంటివద్ద నిలబడి ఉండగా లైట్లు ఆర్పేసి కర్రలు, సీసాలతో దాడిచేసి కొట్టి గాయపరిచారని కారసాల రంగమ్మ కన్నీరుమున్నీరైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఈ దాడి గురించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల 24న తన మామ ఏసుపొగుల రవి, మరో పదిమందిపై సీసాలతో దాడిచేశారని మాధవి తెలిపింది. బయట నుంచి తాగునీరు తెచ్చుకోవాలన్నా భయమేస్తోందని చెప్పింది.
ఆఖరికి పిల్లలపై పాఠశాలల వద్ద దాడిచేస్తున్నారని పలువురు తెలిపారు. 50కి పైగా కుటుంబాలు గ్రామం బయటే ఉంటున్నట్లు చెప్పారు. కారసాల ఆదాం, పల్లెపు రాంబాబు, శ్యాంబాబు తదితరులు గ్రామం విడిచి వెళ్లారని వారు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని వారిని కట్టడి చేయాలని బాధిత మహిళలు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment