
టీడీపీ అరాచకాలపై ఎక్స్ (ట్విటర్) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే,
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అరాచకాలపై ఎక్స్ (ట్విటర్) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం?’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.
Sri @naralokesh, టీడీపీ వాళ్ళు నడిరోడ్డు మీద పట్టపగలు వైసీపీ వాళ్ళను హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా వైసీపీ వాళ్ళే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్ బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? 1/2
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 23, 2024
‘‘అంతు చూస్తా, పాదాలతో తొక్కేస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము.. నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదు, హోం మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది.. ప్రజలే కాదు.. పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అంతు చూస్తా, పాదాలతో తొక్కెస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము, నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతాదని అనుకోలేదు, హోమ్ మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది ... ప్రజలే కాదు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో. 2/2
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 23, 2024