ఏపీలో హింస తారాస్థాయికి.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ | MP Vijaya Sai Reddy Tweet On Vinukonda Young Man Murder And TDP Attacks In AP, See Details | Sakshi
Sakshi News home page

ఏపీలో హింస తారాస్థాయికి.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

Published Thu, Jul 18 2024 1:35 PM | Last Updated on Thu, Jul 18 2024 3:54 PM

Mp Vijaya Sai Reddy Tweet On Tdp Attacks

సాక్షి, తాడేపల్లి: ‘‘ఏపీలో హింస తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కులోన్మాదులు నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి జోక్ గా మారాయి’’ అంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ రాజకీయ హింసలో భాగంగా వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం నేత రషీద్‌ హత్యకు గురయ్యాడు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

మరోవైపు వినుకొండ ఘటనపై వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది. ‘‘మరీ ఇంత నీచమా? ఇలా చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా?. జిలాని కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నిఇన్ని కావు’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘టీడీపీ పెద్దల అండదండలతో ఇప్పుడు రాక్షసుడిలా మారి వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్ నిండు ప్రాణం అత్యంత కిరాతకంగా తీశాడు. దాంతో ఇప్పుడు జనం ఉమ్మేస్తున్నారని వైఎస్సార్‌సీపీపైకి నెపం నెడుతున్నావంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా?. టీడీపీ పెద్దలతో నిందితుడు జిలాని తిరుగుతున్న ఫోటోలు ఇవిగో.. ఇప్పుడు ఏం చెప్తావ్ చంద్రబాబూ?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నిలదీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement