బాంబు దాడులకు నిండు గర్భిణి బలి
కడుపులోని చిన్నారి మాత్రం సజీవంగానే
సిజేరియన్ చేసి కాపాడిన వైద్యులు
అద్భుతానికి వేదికైన గాజా
దెయిర్ అల్ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భుతాలకూ వేదికగా మారుతోంది. సెంట్రల్ గాజాలోని నజరేత్ సమీపంలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ భారీగా దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓలా అద్నాన్ హర్బ్ అల్‌కుర్ద్ అనే 9 నెలల నిండు గర్భిణి కుటుంబమూ ఉంది.
ఆ ఇంట్లో ఆరుగురు దాడికి బలవగా ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో హుటాహుటిన అల్ అవ్దా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయతి్నంచినా గాయాల తీవ్రతకు తాళలేక అద్నాన్ కన్నుమూసింది. కానీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉన్నట్టు వైద్యులకు అనుమానం వచి్చంది. అల్ట్రా సౌండ్ చేసి చూడగా చిన్నారి గుండె కొట్టుకుంటున్నట్టు తేలింది. దాంతో హుటాహుటిన సిజేరియన్ చేశారు.
పండంటి మగ బిడ్డను విజయవంతంగా కాపాడారు. మృత్యుంజయునిగా నిలిచిన అతనికి మలేక్ యాసిన్ అని పేరు పెట్టినట్టు సర్జన్ అక్రం హుసేన్ తెలిపారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ అందించారు. పరిస్థితి కాస్త మెరుగు పడగానే ఇంక్యుబేటర్‌లో ఉంచి హుటాహుటిన దెయిర్ అల్ బలాలోని అల్ అక్సా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment