Full pregnant woman died
-
Israel-Hamas war: మృత్యుంజయుడు!
దెయిర్ అల్ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భుతాలకూ వేదికగా మారుతోంది. సెంట్రల్ గాజాలోని నజరేత్ సమీపంలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ భారీగా దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓలా అద్నాన్ హర్బ్ అల్కుర్ద్ అనే 9 నెలల నిండు గర్భిణి కుటుంబమూ ఉంది. ఆ ఇంట్లో ఆరుగురు దాడికి బలవగా ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో హుటాహుటిన అల్ అవ్దా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయతి్నంచినా గాయాల తీవ్రతకు తాళలేక అద్నాన్ కన్నుమూసింది. కానీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉన్నట్టు వైద్యులకు అనుమానం వచి్చంది. అల్ట్రా సౌండ్ చేసి చూడగా చిన్నారి గుండె కొట్టుకుంటున్నట్టు తేలింది. దాంతో హుటాహుటిన సిజేరియన్ చేశారు. పండంటి మగ బిడ్డను విజయవంతంగా కాపాడారు. మృత్యుంజయునిగా నిలిచిన అతనికి మలేక్ యాసిన్ అని పేరు పెట్టినట్టు సర్జన్ అక్రం హుసేన్ తెలిపారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ అందించారు. పరిస్థితి కాస్త మెరుగు పడగానే ఇంక్యుబేటర్లో ఉంచి హుటాహుటిన దెయిర్ అల్ బలాలోని అల్ అక్సా ఆస్పత్రికి తరలించారు. -
సరైన వైద్యం అందక గర్భవతి మృతి
- ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ధర్నా శ్రీకాళహస్తి : వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భవతి మృతిచెందిందని బాధితులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు కడుపులోని ఇద్దరు మగశిశువుల ప్రాణంతీసిం దనీ, సకాలంలో సరైన వైద్యం అందకపోవడమే అందుకు కారణమయిందన్నారు. శ్రీకాళహస్తిలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు పట్టణంలోని కైలాసగిరి ప్రాంతానికి చెందిన సునీల్ భార్య సుధారాణి నిండు గర్భవతి. పట్టణంలోని నగరివీధిలో ఓ వైద్యురాలి వద్ద వారం వారం పరీక్షలు చేసుకుంటోంది. సోమవారం కడుపునొప్పిగా ఉండడంతో అదే ఆస్పత్రికి వెళ్లింది. వారు ఓ సూది మందు ఇచ్చి రెండు గంటల తర్వాత తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి సిఫారసు చేశారు. అక్కడికి వెళుతుండగా ఆమె మృతి చెందింది. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్ట్మార్టం నిర్వహించారు. తల్లి మృతదేహంతో పాటు కడుపులోని ఇద్దరు మగబిడ్డల శవాలను అప్పగించారు. వైద్యురాలు నిర్లక్ష్యం తోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాచేశారు. ఆస్పత్రిలోని వైద్యురాలిపై మండిపడ్డారు. వన్ టౌన్ సీఐ చిన్నగోవింద్ అక్కడికి సిబ్బందితో చేరుకుని వివాదాన్ని సద్దుమణిచారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని సీఐ తెలిపారు.