పచ్చ బ్యాచ్‌ అరాచకం.. వైఎస్సార్‌సీపీ మహిళా నేతను చంపేస్తామంటూ బెదిరింపులు! | TDP Leaders Attacks On YSRCP Supporters In AP | Sakshi
Sakshi News home page

పచ్చ బ్యాచ్‌ అరాచకం.. వైఎస్సార్‌సీపీ మహిళా నేతను చంపేస్తామంటూ బెదిరింపులు!

Published Wed, Aug 28 2024 7:41 AM | Last Updated on Wed, Aug 28 2024 8:41 AM

TDP Leaders Attacks On YSRCP Supporters In AP

👉ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పచ్చ బ్యాచ్‌ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా ఎల్లో బ్యాచ్‌ మరోసారి రెచ్చిపోయింది..

👉వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ ‘చెత్త’ రాజకీయాలకు తెర లేపింది. తన ఇంటి ముందు చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. మేయర్‌తో పాటుగా ఏకంగా 14 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. దీంతో, తమపై కేసులు పెట్టడంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

👉మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ మహిళా సర్పంచ్‌ చాందినిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు.  వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పచ్చ బ్యాచ్‌ ఆమెకు వార్నింగ్‌ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో సర్పంచ్‌ చాందిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement