ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు | Tdp attacks on ysrcp cadre | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు

Published Sat, Jul 27 2024 5:16 AM | Last Updated on Sat, Jul 27 2024 5:16 AM

Tdp attacks on ysrcp cadre

ఒంటరిగా ఉన్న మహిళతో అనుచిత ప్రవర్తన

స్థలం విషయంలో గొడవకు దిగి దౌర్జన్యం 

గ్రామ సచివాలయంలోకి చొరబడి మాజీ సీఎం జగన్‌ చిత్రానికి పెయింట్‌ 

రైతుభరోసా కేంద్రం,సచివాలయ బోర్డుల తొలగింపు

ద్విచక్ర వాహనం దహనం  

వైఎస్సార్‌సీపీ జెండా పోల్‌ ధ్వంసం 

సాక్షి నెట్‌వర్క్‌: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీ­కాలు గురువారం రాత్రి, శుక్రవారం కూడా యథేచ్ఛగా కొన­సా­గాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అడ్డూఅదుపు లేకుండా ప్రవ­ర్తించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అను­చితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహ­నాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాల­యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రానికి పెయింట్‌ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్‌సీపీ జెండాపోల్‌ను ధ్వంసం చేశారు. 

»  పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహి­ళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీ­యులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్‌ రవీంద్ర­నాయక్‌ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేష­న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

»   ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో  వైఎస్సార్‌సీపీ మండల జేసీఎస్‌ కన్వీనర్‌ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్‌ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమ­యంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నేతలు ఖండించారు.  

»   అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరి­ణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్‌ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్‌ వేశారు. అక్కడ పికెట్‌లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసుస్టేషన్‌ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్‌ఐ సాగర్‌తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు. 

»   ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో రైతు­భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం బోర్డులను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అధికారుల పేర్లు ఉన్న శిలాఫలకాలను తొల­గించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

»   పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభా­గం జిల్లా అధ్యక్షుడు, 24వ వార్డు కౌన్సిలర్‌ అచ్యుత శివ­ప్రసాద్‌ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌ పోసి దహనం చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం గమనించిన శివప్రసాద్‌ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి దుండ­గులు పరారయ్యారు. దీనిపై పట్టణ సీఐ పోలూరి శ్రీని­వాసరావుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

»  గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని అంజిరెడ్డినగర్‌లో వైఎస్సార్‌సీపీ జెండా పోల్‌ను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులి ఆశ్రయించనున్నట్లు వైఎ­స్సాÆ­Š‡సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement