ఆదుకోండి మహాప్రభో.. | Tdp attacks across the state | Sakshi
Sakshi News home page

ఆదుకోండి మహాప్రభో..

Published Wed, Jul 31 2024 5:15 AM | Last Updated on Wed, Jul 31 2024 5:15 AM

Tdp attacks across the state

ఎస్సీల జీవనోపాధిపై ‘తమ్ముళ్ల’ దుర్మార్గం

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల షాపుల నేలమట్టం

ఇనుప చువ్వలు అమ్మి ఆ నగదుతో పార్టీ చేసుకున్న వైనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ సానుభూ­తిప­రులుగా ఉన్న దళితుల షాపులను టీడీపీ నేతలు కూల్చే­శారు. జీవనోపాధి లేకుండా చేయడంతో 3 ఎస్సీ కుటు­ంబాలు లబోదిబోమంటున్నాయి. కావలి నియోజ­క­వ­ర్గంలోని దగదర్తి మండలం తడక­లూరిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లైన రవి­కుమార్, చిట్టిబాబు, రాజ్‌కుమార్‌ గ్రా­మ పంచాయతీకి చెం­దిన 3 దుకాణాల్లో టిఫిన్, కూల్‌­డ్రింక్స్‌ విక్ర­యిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నా­రు. పంచాయతీకి అద్దెలు సకాలంలో చెల్లిస్తుంటారు. 

టీడీపీ అధి­కారంలోకి వచ్చి­న­ప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు గ్రామంలో రెచ్చిపోతున్నారు. సర్పంచ్‌ వైఎస్సా­ర్‌సీపీ మద్దతుదారుడు కావడంతో ఆయనపై దాడి చేశారు. అలాగే, రవికుమార్, చిట్టి­బాబు, రాజ్‌­కుమార్‌ దుకాణా­లు ఖాళీ చేయ­లే­దని మంగళవారం సాయంత్రం దారుణా­నికి ఒడి­గ­ట్టారు. జేసీబీని తీసుకొచ్చి 3 షాపులను నేటమట్టం చేశారు. అప్పటికప్పుడే ట్రాక్టర్లలో మట్టిని తరలి­ం­చేశారు. దుకాణాలు కూల్చేసిన అవశేషాలు అక్కడ లేకుండా చేశారు. షాపులు కూల్చగా వచ్చిన ఇనుప చువ్వలను అమ్మేసి ఆ నగదుతో మందు పార్టీ చేసుకున్నారు.

టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలు కాపాడండి
మా ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు 
సోషల్‌ మీడియా ద్వారా ఓ అర్చకురాలి వినతి
కొత్తపేట: ‘టీడీపీ నేతల నుంచి మా ప్రాణా­లను కాపాడండి. మా ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. గతంలో వారు నా చిన్న కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు నా ఇద్దరు కుమార్తెలతోపాటు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలి.’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన అయిలూరి సంతోషలక్ష్మి అనే మహిళా అర్చకురాలు వేడుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఆవేదనను వివరిస్తూ ఓ వీడి­యోను మంగళవారం సోషల్‌ మీడియాలో పెట్టా­రు. 

‘నా భర్త అయిలూరి శివకుమార్‌ మందపల్లి ఉమామందేశ్వర(శనైశ్చర) స్వామి వారి దేవస్థానం అర్చకుడిగా పనిచేసేవారు. ఆయన 2009లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత నేను వంశపారంపర్య వారసత్వ హక్కులు పొందాను. దేవస్థానం అర్చకత్వ బాధ్యతలను చూస్తూ నా ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాను. మా గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు నా ఆస్తులను ఆక్రమించుకున్నా­రు. నాకు ఉన్న అర్చకత్వ ఆధారాన్ని తప్పించాలని ప్రయతి్నంచారు. వంశపారపర్యం అర్చ­కత్వ హక్కు­ను కొనసాగించేలా దేవదాయ­శాఖ నుంచి ఉత్తర్వులు తెచ్చు­కు­న్నాను. నా ఆస్తులను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి 2018లో ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నాను. 

అయినా ఆ స్థలాల్లోనే నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో వారు నా చిన్న కుమార్తె మైనర్‌గా ఉన్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించగా, పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును మేమే కొట్టేయించాలని బెదిరిస్తున్నారు. లేకపోతే చంపేస్తామ­ని హెచ్చ­రిస్తున్నారు. బ్రాహ్మణ మహిళను అని కూడా చూడకుండా ఇంటికి వచ్చి అసభ్యకరంగా వేధిస్తున్నారు. వారి ఆగడాలపై నా కుమార్తె కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు ఉందని మమ్మల్నే బెదిరిస్తు­న్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌ జోక్యం చేసు­కుని మాకు రక్షణ కల్పించాలి. లేకపోతే మాకు ఆత్మ­హత్యలే శరణ్యం’ అని ఆమె కన్నీటిపర్యంతమ­­య్యారు. కాగా, సంతోష­లక్షి్మ, ఆమె కుమార్తె తమకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, తాను వారిని బెదిరించలేదని కొత్తపేట ఎస్‌ఐ ఎం.అశోక్‌ తెలిపారు.

బరితెగించిన పసుపు గూండాలు
వ్యాపారి ఇంటిపై 20 మంది దాడి, ఇల్లు, సామగ్రి ధ్వంసం
నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ గూండాలు బరితెగించారు. ఆర్యవైశ్య వ్యాపారి ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి ఇల్లు ధ్వంసం చేసి అడ్డు వచి్చన మహిళలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి చేసి అధికార పార్టీ గూండాయిజాన్ని ప్రదర్శించారు. ప్రకా‹Ùనగర్‌ 60 అడుగుల రోడ్డు సమీపంలో శివసాయి ట్రేడర్స్‌ పేరిట నోముల మల్లికార్జునరావు సిగరెట్, పాన్‌మసాలా హోల్‌సేల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే అల్లం పూర్ణచంద్రరావు రెండేళ్ల క్రితం మల్లికార్జునరావు వద్ద రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 

వ్యాపారంలో నష్టం వచి్చందని సాకు చూపి పూర్ణచంద్రరావు డబ్బులు తిరిగి చెల్లించకపోవటంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పూర్ణచంద్రరావు రూ.20 లక్షలు మల్లికార్జునరావుకు ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు చెల్లించాడు. మనసులో అక్కసు పెంచుకున్న పూర్ణచంద్రరావు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని మల్లికార్జునరావుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. మంగళవారం 20 మంది అనుచరులతో పూర్ణచంద్రరావు కర్రలు తీసుకొని మల్లికార్జునరావు ఇంటిపై దాడి చేసి సామగ్రి, పూల కుండీలను ధ్వంసం చేసి సీసీ కెమెరాలను పగుల గొట్టారు. అనంతరం మల్లికార్జునరావు దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 

అధికారం మాది.. ఊరు విడిచి వెళ్లిపోండి.. ఎమ్మెల్యే గారు వెళ్లి దాడి చేయమన్నాడు..అని చెప్పి దాడిలో పాల్గొన్న గూండాలు బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించినా పట్టించుకోకుండా పోలీసుల సమక్షంలోనే మరో మారు కర్రలతో మల్లికార్జునరావు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పూర్ణచంద్రరావు, జుజ్జూరి సురేంద్రస్వామి, తమ్మిశెట్టి ధనరాజ్, సింహాద్రి గంగాధర్‌రావుతోపాటు మరో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సీహెచ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. పూర్ణచంద్రరావు పలు అక్రమ గుట్కా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గుట్కా వ్యాపారం అంతా తానే చేయాలని మిగిలిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement