
ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి, బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి 'అర్జున్ రామ్ మేఘ్వాల్' కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత పార్లమెంటు చరిత్రలో జూన్ 4, 2024 ఎప్పటికీ చాలా ముఖ్యమైన రోజుగా గుర్తుంచుకోబడుతుంది. ఈ రోజు వచ్చే ఫలితాలు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బలమైన పునాది వేస్తుంది. దేశం మొత్తం దీని కోసం వేచి ఉంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. ఇప్పటికే బికనీర్ ప్రజలు మమ్మల్ని మూడుసార్లు ఆశీర్వదించారు. నాలుగోసారి కూడా ఆశీర్వదించబోతున్నారని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
#WATCH | Bikaner, Rajasthan: Union Minister and BJP candidate from Bikaner Lok Sabha seat, Arjun Ram Meghwal says, "4th June 2024 will always be remembered as a very important day in the history of the Indian Parliament. The results that will come today will lay a strong… pic.twitter.com/4SPmYs8FsS
— ANI (@ANI) June 4, 2024