
లోక్‌సభ ఎలక్షన్ 2024 కౌంటింగ్ మొదలైంది. కానీ, బీజేపీ తొలి విజయాన్ని అందుకుందని మీకు తెలుసా?. అదేంటీ ఫలితం ఒక్క రౌండ్ కూడా పూర్తి కాకముందే ఈ గెలుపు ఎక్కడిది అంటారా?.
నిజానికి ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వకముందే.. బీజేపీ బోణీ కొట్టేసింది. నెల రోజులకు ముందే బీజేపీ అభ్యర్థి 'ముకేష్ దలాల్' సూరత్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. అక్కడ నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ కొన్ని కారణాల వల్ల తిరస్కరించబడింది. అంతే కాకుండా ఇక్కడ నామినేషన్ వేసిన అభ్యర్థులంతా.. నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. అలా.. బీజేపీ మొదటి విజయాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment