ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ | INDIA Bloc Huddle At mallikarjun Kharge Residence | Sakshi
Sakshi News home page

ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ

Published Wed, Jun 5 2024 6:25 PM | Last Updated on Wed, Jun 5 2024 9:14 PM

INDIA Bloc Huddle At mallikarjun Kharge Residence

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ ముగిసింది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలంతా కలిసి చర్చించి ప్రతిపక్షంలో కొనసాగాలని నిర్ణయించారు.

ఇండియా కూటమి సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కూటమిలోని స్నేహితులందరికీ స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా, సమన్వయంతో, పూర్తి శక్తితో పోరాడి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రజాభిప్రాయం ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఉందన్నారు.

ఎన్నికలకు బీజేపీ మోదీ పేరు, మోదీ ముఖంతో వెళ్ళారని, బీజేపీకి మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు అతని నాయకత్వం గురించి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మోదీజికి వ్యక్తిగతంగా ఇది రాజకీయ ఓటమి మాత్రమే కాదు, నైతిక పరాజయం కూడా అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై విశ్వాసం, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయ లక్ష్యాలకు కట్టుబడి ఉన్న అన్ని రాజకీయ పార్టీలను భారతదేశ కూటమి స్వాగతిస్తున్నామని చెప్పారు.

కాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 240 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీకి కావాల్సిన సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది. ఎన్టీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సిద్ధమైంది. అయితే బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగ‌ర్(272) దాట‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో ఆశ‌లు చిగురించాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన క‌స‌రత్తు, వివిధ అంశాలపై చర్చించేందుకు నేడు సమావేశమైంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement