
ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ముందంజలో ఉన్నారు. దిగ్గజ నేతలైన మోదీ, రాహుల్ గాంధీ వారి వారి నియోజక వర్గాల్లో దూసుకెళ్తున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది .
2018 నుంచి 2022 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిప్లబ్ కుమార్ దేబ్.. త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నిలిచారు. ఈయన ఇప్పటికే తన సమీప ప్రత్యర్థి ఆశిష్ కుమార్ సాహా కంటే.. 5,70,071 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అదే సమయంలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానంలో, బీజేపీ అభ్యర్థి కృతి దేవి డెబ్బర్‌మన్ తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ(ఎం)) రాజేంద్ర రియాంగ్‌పై 2,92,164 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Former Tripura CM and BJP candidate from West Tripura Lok Sabha constituency, Biplab Kumar Deb leading from this seat with a margin of 5,70,071 votes
(file pic) #LokSabhaElections2024 pic.twitter.com/CBVyvLRMa5— ANI (@ANI) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment