ఖమ్మం: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.
కాంగ్రెస్ గెలుపుతో బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్‌చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.
- కాంగ్రెస్: 759603
- బీఆర్‌ఎస్: 297592
- బీజేపీ: 117075
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...
- కాంగ్రెస్: 7326
- బీఆర్‌ఎస్: 1490
- బీజేపీ: 1561
Comments
Please login to add a commentAdd a comment