కరీంనగర్‌: భారీ ఆధిక్యంలో బండి సంజయ్‌ | BJP's Bandi Sanjay Kumar Leading In Karimnagar Parliament Seat | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రికార్డు బ్రేక్‌.. కరీంనగర్‌లో బండి సంజయ్‌ భారీ మెజార్టీ

Published Tue, Jun 4 2024 11:36 AM | Last Updated on Tue, Jun 4 2024 6:32 PM

BJP's Bandi Sanjay Kumar Leading In Karimnagar Parliament Seat

సాక్షి, కరీంనగర్‌:  కరీంనగర్ పార్లమెంట్‌లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేశారు. 2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం సాధించారు. 2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ రికార్డు కొల్లగొట్టారు.

ఇక.. మంగళవారం లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైన మొదటి రౌండ్‌ నుంచి బీజేపీ స్పష్టమైన మెజార్టీ కనబరుస్తోంది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్‌ అభ్యర్థి బి. వినోద్ కుమార్ వెనకంజలో ఉన్నారు. ఈ ట్రెండ్‌ చూస్తే.. బండి సంజయ్‌ రెండోసారి కరీంనగర్‌ పార్లమెంట్‌ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement