బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వీట్స్ తయారీ.. గెలుపు కోసం పూజలు - వీడియో | Sweets Being Prepared at the BJP Headquarters in Delhi and Pooja in Patna | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వీట్స్ తయారీ.. గెలుపు కోసం పూజలు - వీడియో

Published Tue, Jun 4 2024 7:36 AM | Last Updated on Tue, Jun 4 2024 8:00 AM

Sweets Being Prepared at the BJP Headquarters in Delhi and Pooja in Patna

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని ఇప్పటి వరకు సర్వేలన్నీ.. మూకుమ్మడిగా పేర్కొన్నాయి. అయితే ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెల్లడవుతాయి.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే పాట్నాలో బీజేపీ కార్యకర్తలు పండితులతో పూజలు చేయించారు. ఇందులో మోదీ ఫోటోలను ప్రదర్శిస్తూ.. పండితులు పూజలు చేస్తుంటే.. కార్యకర్తలు భజనలు చేయడం కూడా చూడవచ్చు.

బీజేపీ గెలుపు అనంతరం విజయోత్సవాల కోసం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూరీలు, స్వీట్లు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో వంట చేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో తయారు చేయడం చూడవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement