
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ సీటును బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ తేడాతో గెలుచుకున్నారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇంతటి భారీ విజయం ఇక్కడ తొలిసారిగా నమోదైందని లాల్వానీ చెప్పుకున్నారు. అదేవిధంగా, నోటాకు సైతం రికార్డు స్థాయిలో 2.18 లక్షల ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి 14.01శాతంగా ఉన్నాయి. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ నేత అక్షయ్ కాంతి బామ్‌కు టికెట్టిచి్చంది.
అయితే, ఆయన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి పారీ్టకి షాకిచ్చారు. అనంతరం అక్షయ్ కాంతి బామ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో, కాంగ్రెస్ పారీ్టకి అభ్యర్థుల్లేకుండా పోయారు. తమ అభ్యర్థికి బదులుగా నోటాకు ఓటేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. దీంతో రికార్డు స్థాయిలో నోటాకు రూ.2.18 లక్షల ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment