దేశవ్యాప్తంగా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తెలిసిపోతాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల ఫలితాలు 8,360 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బయటపెట్టనున్నాయి. సర్వేలు పేర్కొన్నట్లు ఈ ఏట మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలిస్తే.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారు. వరుసగా మోదీ మూడోసారి గెలిస్తే జవహర్‌లాల్ నెహ్రూ సరసన నరేంద్ర మోదీ చేరుతారు. ఇది 1984 తరువాత అతి పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.
ఇప్పటికే నరేంద్ర మోదీ 400 సీట్లు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయన్న రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 441 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 328 స్థానాల్లో బరిలోకి దిగింది.
ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఇప్పటి వరకు బీజేపీ హవా సాగుతోంది. బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. గెలుపోటములు మరి కొన్ని గంటల్లో తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment