
హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. తెలంగాణలోని 17 స్థానాలో ఒక్కస్థానంలో కూడా ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో విజయం సాధించలేదు. ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ నువ్వా- నేనా అని పోటీపడుతుంటే బీఆర్‌ఎస్ చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘‘ టీఆర్‌ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో అన్నీ చూశాం. విజయాలు, అనేక ఎదురుదెబ్బలు ఎన్నో చూశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన అతిపెద్ద విజయంగా మిగిలిపోతుంది. ప్రాంతీయ పార్టీ కావడంతో వరుసగా రెండు రాష్ట్ర ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించింది.
2014లో 63/119 స్థానాలు, 2018లో 88/119 స్థానాలు, ప్రస్తుతం, ప్రధాన ప్రతిపక్షం 1/3వ స్థానాలతో 39/119 ( 2023లో అసెంబ్లీ ఎన్నికలు) నేటి ఎన్నికల ఎదురుదెబ్బ ఖచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాము. ఫీనిక్స్ లాగా మళ్ళీ పైకి లేస్తాము’’ అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment