హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆయన సతీమణి శృతి తప్పుపట్టారు. తన భర్తను ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేశారని అన్నారు.
‘‘సమాచారం లేకుండా ఇలా అరెస్ట్ చేయటం సరికాదు. నిన్న(మంగళవారం) రాత్రి, ఇవాళ ఉదయం ఇంటి ముందు పోలీసులు కూడా ఉన్నట్టు కనిపించలేదు. హఠాత్తుగా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు నా భర్త నాతో మాట్లాడలేదు. వాకింగ్‌కు వెళ్లి నేను వచ్చేశాను. తర్వాత ఆయన వస్తున్న సందర్భాన్ని చూసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని అన్నారు.
మరోవైపు.. ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని.. ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ అప్రజస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.
అనంతరం..నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టుపైన కోర్టులో పోరాటం చేస్తుందని కేటీఆర్ శృతికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment