ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేయనుట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోనే విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పార్టీ కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయం చెందడంతో ఫడ్నవీస్ రాజీనామా నిర్ణయం తెరమీదకొచ్చింది. 2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను సొంతం చేసుకున్న కాషాయ పార్టీ.. ఈసారి కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 14 స్థానాలను చేజార్చుకుంది.
2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ సీట్లకు కోత పడటంలో యూపీ, మహారాష్ట్రనే ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేవలం 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇది మెజార్టీ మార్కుకు(272) 32 స్థానాలు తక్కువ కావడం గమనార్హం.
ఇక 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించింది. ఉద్దవ్ వర్గం శివసేన 9 స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 9 స్థానాల్లో, శివసేన(ఏక్‌నాథ్ షిండే)7 చోట్ల, ఎన్సీపీ( అజిత్ పవార్) ఒక చోట విజయం సాధించింది. ఓ స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment