
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్ధానం ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడం గమనార్హం. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆయన ఈడీ కస్టడీలో ఉండటంతో చిదంబరం జైలులోనే గడపాల్సి ఉంది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్ 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్ నమోదైంది
Comments
Please login to add a commentAdd a comment