సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబంధించి ఈడీ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం తీర్పు వెలువరించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడరాదని, పాస్‌పోర్టును సమర్పించాలని చిదంబరాన్ని జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఆగస్ట్ 21న చిదంబరం అరెస్ట్ కాగా, సీబీఐ కేసులోనూ ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఇక అరెస్ట్ అయిన అనంతరం 105 రోజుల తర్వాత ఈడీ కేసులోనూ బెయిల్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment