IPL 2022 SRH Vs GT: P Chidambaram And Shashi Tharoor Praises On Umran Malik Performance - Sakshi
Sakshi News home page

Umran Malik: అతడిని వీలైనంత త్వరగా టీమిండియాకు సెలక్ట్‌ చేసి..

Published Thu, Apr 28 2022 10:55 AM | Last Updated on Mon, May 2 2022 6:16 PM

IPL 2022 BCCI Should Give Umran Exclusive Coach Says P Chidambaram - Sakshi

PC: IPL/BCCI

IPL 2022- Umran Malik 5 Wickets: ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ యువ కెరటం కేవలం 25 పరగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఈ ఘనత సాధించిన ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఉమ్రాన్ మాలిక్ ఆటకు ఫిదా అయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ జమ్మూ కశ్మీర్‌ బౌలర్‌ ప్రదర్శనను ఆకాశానికెత్తారు. ‘‘ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. పదునైన పేస్‌తో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.

ఈరోజు తన ప్రదర్శన చూసిన తర్వాత ఫైండ్‌ ఆఫ్‌ దిస్‌ ఐపీఎల్‌ ఎడిషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ కొనియాడారు. అదే విధంగా.. వీలైనంత త్వరగా ఉమ్రాన్‌ మాలిక్‌ను జాతీయ జట్టులోకి ఎంపియ చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి చిదంబరం సూచించారు. అంతేకాదు బీసీసీఐ ఉమ్రాన్‌ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్‌ను నియమించి మరింత రాటుదేలేలా శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక శశి థరూర్‌ సైతం.. ‘‘అత్యద్భుతమైన ప్రతిభ. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయండి. బుమ్రాతో కలిసి ఉమ్రాన్‌ బ్రిటిష్‌ ఆటగాళ్లను బెంబేలెత్తిస్తాడు’’ అని ట్వీట్‌ చేశారు. ఇక బుధవారం(ఏప్రిల్‌ 28) నాటి మ్యాచ్‌ విషయానికొస్తే... గుజరాత్‌ టైటాన్స్‌ ముందు సన్‌రైజర్స్‌ తలొగ్గక తప్పలేదు.

ఆఖర్లో గుజరాత్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌తో రాణించడం(11 బంతుల్లో 31 పరుగులు- నాటౌట్‌)తో విజయం హార్దిక్‌ సేన సొంతమైంది. ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌.. సన్‌రైజర్స్‌పై గెలుపొందింది. ఇక ఉమ్రాన్‌ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 40: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్లు
ఎస్‌ఆర్‌హెచ్‌- 195/6 (20)
గుజరాత్‌ టైటాన్స్‌- 199/5 (20)

చదవండి👉🏾 Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్‌ దొబ్బిందా.. ఆ బౌలింగ్‌ ఏంటి?'.. మురళీధరన్‌ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement