sunrisers hyderabd
-
IPL 2023: అతడు పూర్తిగా విఫలం.. 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే!
IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ హెడ్‌కోచ్ టామ్ మూడీ.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం. అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్‌గా ఐపీఎల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. 14 కోట్లు అంటే చాలా ఎక్కువ అందుకే కేన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్ మూడీకి గుడ్ బై చెప్పిన ఎస్ఆర్ హెచ్.. విండీస్ లెజెండ్ బ్రియన్ లారాను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్‌గా కేన్ విఫలం ఇదిలా ఉంటే.. గత సీజన్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్‌కప్‌లో కేన్ బృందం రన్నరప్‌గా నిలవగా.. ఈసారి సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గానూ కేన్ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్, సామ్ కర్రన్.. రికార్డు ధర ఖాయం..! IPL 2023: కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. మరో ఇద్దరు ఔట్ -
IPL 2022: ఈ మ్యాచ్‌లో ఓడిపోయారో మీ పని ఇక అంతే!
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగింట మాత్రమే గెలుపొందింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే పంత్ సేన నెట్రన్ రేటు పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వరుస ఓటములు కలవరపెట్టే అంశంగా పరిణమించాయి. మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరుగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ అజయ్ జడేజా, మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకమైనది. మిగతా జట్ల కంటే ఢిల్లీ ఒకే ఒక్క మ్యాచ్ తక్కువగా ఆడింది. కానీ వాళ్లకు ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఎస్ఆర్హెచ్ను ఓడించినా.. ఇతర జట్లతో కలిసి సంయుక్తంగా 10 పాయింట్లతో నిలుస్తారు. అందుకే ఈ మ్యాచ్ గెలవడం ఢిల్లీకి అత్యంత ముఖ్యం. ఇటీవలి మ్యాచ్‌లను పరిశీలిస్తే వాళ్లకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారంటే.. ఈ సీజన్లో వారి ప్రయాణం ముగింపునకు వచ్చినట్లే అవుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ‘‘ఓపెనింగ్ భాగస్వామ్యాలు పర్లేదు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు ఇంకా కూడా కుదురుకోలేకపోతున్నారు. పరుగులు సాధించలేకపోతున్నారు. ఇక అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో కూడా బౌలర్లు విఫలమవుతున్నారు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ తొమ్మిదింట 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓడగా.. ఢిల్లీ.. లక్నో చేతిలో ఓటిమిని మూటగట్టుకుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారగా... గెలిచి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ 50: సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: బ్రబౌర్న్ స్టేడియం, ముంబై సమయం: రాత్రి 07:30 నిమిషాలకు ఆరంభం చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Our last few games have been about small margins. It's time to seize the clutch moments, starting with today. And @tripathirahul52 concurs. 💪🏾🗣️#DCvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/JKLhXJZuJV — SunRisers Hyderabad (@SunRisers) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఇప్పుడు అదృష్టం కలిసి వస్తోంది.. నా భయం అదే!
IPL 2022 SRH Vs GT- Hardik Pandya Comments: గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింట గెలిచింది. తద్వారా 14 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఒకటీ రెండూ మినహా గుజరాత్ గెలిచిన మ్యాచ్‌లన్నింటిలోనూ దాదాపుగా ప్రతీదీ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినదే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో విజయం, చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఆఖరి బంతికి 3 వికెట్ల తేడాతో గెలుపు... తాజాగా బుధవారం(ఏప్రిల్ 27) నాటి మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చివరి బంతికి జయభేరి. నిజానికి ఈ మ్యాచ్‌లలో అదృష్టం కలిసిరాకపోతే గుజరాత్ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఇదే మాట అంటున్నాడు. సన్‌రైజర్స్‌పై విజయానంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్ రూంలో మా వాళ్లతో జోక్ చేస్తూ ఉంటాను. ‘చూడండి మీరు మంచివాళ్లు.. మీకు నేను సహాయం చేస్తాను’ అని ఆ దేవుడు చెబుతున్నాడు. చాలాసార్లు ఆఖరి నిమిషంలో మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే నా భయానికి కారణమైంది. ఒకవేళ నాకౌట్ దశలో మాకు అదృష్టం కలిసిరాదేమోననిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానన్న హార్దిక్.. జట్టుకు అవసరమైన సమయంలో కచ్చితంగా తన సేవలు అందిస్తానని పునరుద్ఘాటించాడు. వరుస విజయాల నేపథ్యంలో జట్టులో ఉత్సాహం నిండిందని, తమ విజయాల వెనుక సహాయక సిబ్బంది శ్రమ కూడా ఉందంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ మ్యాచ్ 40: ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ఎస్ఆర్హెచ్- 195/6 (20) గుజరాత్ టైటాన్స్- 199/5 (20) చదవండి👉🏾Rashid Khan: నాలుగు సిక్సర్లు.. అది స్నేక్షాట్.. ఇలా ఎందుకు అన్నానంటే! WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి.. ప్రత్యేక కోచ్‌తో..
IPL 2022- Umran Malik 5 Wickets: ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ యువ కెరటం కేవలం 25 పరగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఉమ్రాన్ మాలిక్ ఆటకు ఫిదా అయిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ జమ్మూ కశ్మీర్ బౌలర్ ప్రదర్శనను ఆకాశానికెత్తారు. ‘‘ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పదునైన పేస్‌తో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈరోజు తన ప్రదర్శన చూసిన తర్వాత ఫైండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఎడిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ కొనియాడారు. అదే విధంగా.. వీలైనంత త్వరగా ఉమ్రాన్ మాలిక్‌ను జాతీయ జట్టులోకి ఎంపియ చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చిదంబరం సూచించారు. అంతేకాదు బీసీసీఐ ఉమ్రాన్ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్‌ను నియమించి మరింత రాటుదేలేలా శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక శశి థరూర్ సైతం.. ‘‘అత్యద్భుతమైన ప్రతిభ. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయండి. బుమ్రాతో కలిసి ఉమ్రాన్ బ్రిటిష్ ఆటగాళ్లను బెంబేలెత్తిస్తాడు’’ అని ట్వీట్ చేశారు. ఇక బుధవారం(ఏప్రిల్ 28) నాటి మ్యాచ్ విషయానికొస్తే... గుజరాత్ టైటాన్స్ ముందు సన్‌రైజర్స్ తలొగ్గక తప్పలేదు. ఆఖర్లో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ బ్యాట్‌తో రాణించడం(11 బంతుల్లో 31 పరుగులు- నాటౌట్)తో విజయం హార్దిక్ సేన సొంతమైంది. ఐదు వికెట్ల తేడాతో గుజరాత్.. సన్‌రైజర్స్‌పై గెలుపొందింది. ఇక ఉమ్రాన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ మ్యాచ్ 40: ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ఎస్ఆర్హెచ్- 195/6 (20) గుజరాత్ టైటాన్స్- 199/5 (20) చదవండి👉🏾 Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 The Umran Malik hurricane is blowing away everything in its way The sheer pace and aggression is a sight to behold After today’s performance there can be no doubt that he is the find of this edition of IPL — P. Chidambaram (@PChidambaram_IN) April 27, 2022 We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalik https://t.co/T7yLb1JapM — Shashi Tharoor (@ShashiTharoor) April 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ చేదు నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా: శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer Comments: గాయం కారణంగా ఐపీఎల్-2021 సీజన్ తొలి దశకు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. రెండో అంచెలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులతో (41 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో టాప్ స్కోరర్‌గా నిలిచి.. ఢిల్లీ విజయంలో ఈ మాజీ కెప్టెన్ తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌తో శ్రేయస్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా.. గాయం తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను గాయపడ్డాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అసలు గాయాల గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. అలాంటిది అకస్మాత్తుగా గాయపడటం మనసుకు కష్టంగా అనిపించింది. అయితే, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. త్వరగా కోలుకునేలా తమ వంతు సాయం చేశారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా... ‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లిన తర్వాత క్రమంగా కోలుకున్నాను. అక్కడ అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. సానుకూల వాతావరణం ఉంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా మారడానికి దోహదం చేసింది’’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే నా పరుగుల దాహం తీరలేదు. ఈ ఇన్నింగ్స్ నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లు 47 పరుగులు చేసిన అయ్యర్.. ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్.. సిరీస్‌తో పాటు ఐపీఎల్ ఫేజ్ వన్ కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ అద్భుత విజయాలు సాధించిన నేపథ్యంలో.. శ్రేయస్ తిరిగి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని ఫ్రాంఛైజీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: MI Vs KKR: కేకేఆర్‌తో అంత ఈజీ ఏం కాదు.. గతం ఎలా ఉన్నా: రోహిత్ శర్మ Happy to be back out there! Great team effort today, onwards and upwards 🔥 @DelhiCapitals pic.twitter.com/rOLZslQivi — Shreyas Iyer (@ShreyasIyer15) September 22, 2021 -
సన్ రైజర్స్‌కు ముంబై ఇండియన్స్ షాక్
-
సన్ రైజర్స్‌కు ముంబై ఇండియన్స్ షాక్
ముంబై: ఐపీఎల్-10లో సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ నెగ్గింది. పటిష్ట బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. సర్ రైజర్స్ నిర్దేషించిన 159 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వార్నర్ (49), శిఖర్ ధావన్(48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి158 పరుగులు చేసింది. 159 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బట్లర్(14) అవుటైన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ(4)ను రషీద్ ఖాన్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(39), నితీశ్ రాణా(36 బంతుల్లో 45: 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృణాల్ పాండ్యా(20 బంతుల్లో 37: 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో కృణాల్, రాణా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా(2), హర్బజన్(3)లు ముంబైని లక్ష్యానికి చేర్చారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్‌ధావన్‌లు 81 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఈ స్థితిలో జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని నిలుపుతుందనుకున్న సన్ రైజర్స్ వార్నర్ (49) వికెట్ కోల్పోయిన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా(9)ను హర్బజన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ధావన్(48) ఔటయ్యాడు. బెన్ కటింగ్(20) పరవాలేదనిపించినా.. యువరాజ్ సింగ్(5), నమన్ ఓజా(9) నిరాశపరిచారు. 9 పరుగుల వ్యవధిలో నాలుగె వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా 3, హర్భజన్ 2వికెట్లు పడగొట్టగా.. మలింగ, పాండ్యా, మిచెల్ మెక్లిగాన్లకు చెరో వికెట్ దక్కింది. కొంపముంచిన నెహ్రా, ముస్తాఫిజర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 21 పరుగులు ఇవ్వగా.. ఇతర పేస్ బౌలర్లు ఆశీష్ నెహ్రా, ముస్తాఫిజర్ దారుణంగా విఫలమయ్యారు. నాలుగు ఓవర్లు వేసిన నెహ్రా 1 వికెట్ తీసి 46 పరుగులు ఇవ్వగా.. ముస్తాఫిజర్ 2.4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. -
విఫలమైన సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్
ముంబై: ఐపీఎల్-10లో ముంబైతో వాంఖడే స్టేడియంలో జరుగుతున్నమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లకు 8వికెట్లు కోల్పోయి158 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, శిఖర్‌ధావన్‌లు 81 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఈ స్థితిలో జట్టు ముంబైకి భారీ లక్ష్యాన్ని ఇస్తుందనుకున్న తరుణంలో 81 పరుగుల వద్ద దూకుడు మీద ఉన్న వార్నర్(49)ను హర్భజన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే దీపక్ హుడా(9) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. బజ్జీ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర పొలార్డ్‌కు దొరికిపోయాడు. కొద్ది సేపటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ధావన్ (48) వికెట్ కోల్పోవడంతో మిగతా బ్యాట్స్మన్లు క్యూ కట్టారు. బెన్ కట్టింగ్ దాటిగా ఆడడానికి ప్రయత్నించి 20 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో చెలరేగిన యువరాజ్ (5) నిరాశ పరిచాడు. నమాన్ ఓజా(9), రషీద్‌ఖాన్(2), శంకర్ (1)లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేయలేక పోయింది. ఇక ముంబై బౌలర్స్‌లో బుమ్రా 3, హర్భజన్ 2, మలింగ, పాండ్యా, మిచెల్ మెక్లిగాన్లకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో 49 పరుగులు చేయడంతో వార్నర్‌కు ఆరేంజ్ పర్పుల్ క్యాప్ లభించింది.