IPL 2022: Hardik Pandya Fears GT May Run Out Of Luck In Knockouts, Details Inside - Sakshi
Sakshi News home page

Hardik Pandya: ఇప్పుడు అదృష్టం కలిసి వస్తోంది.. కానీ నా భయానికి కారణం అదే!

Published Thu, Apr 28 2022 2:54 PM | Last Updated on Mon, May 2 2022 6:15 PM

IPL 2022: Hardik Pandya Fear They May Run Out Of Luck In Knockout Games - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs GT- Hardik Pandya Comments: గుజరాత్‌ టైటాన్స్‌.. ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింట గెలిచింది. తద్వారా 14 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఒకటీ రెండూ మినహా గుజరాత్‌ గెలిచిన మ్యాచ్‌లన్నింటిలోనూ దాదాపుగా ప్రతీదీ ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగినదే. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో విజయం, చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఆఖరి బంతికి 3 వికెట్ల తేడాతో గెలుపు... తాజాగా బుధవారం(ఏప్రిల్‌ 27) నాటి మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చివరి బంతికి జయభేరి. నిజానికి ఈ మ్యాచ్‌లలో అదృష్టం కలిసిరాకపోతే గుజరాత్‌ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సైతం ఇదే మాట అంటున్నాడు.

సన్‌రైజర్స్‌పై విజయానంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్‌ రూంలో మా వాళ్లతో జోక్‌ చేస్తూ ఉంటాను. ‘చూడండి మీరు మంచివాళ్లు.. మీకు నేను సహాయం చేస్తాను’ అని ఆ దేవుడు చెబుతున్నాడు. చాలాసార్లు ఆఖరి నిమిషంలో మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే నా భయానికి కారణమైంది. ఒకవేళ నాకౌట్‌ దశలో మాకు అదృష్టం కలిసిరాదేమోననిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు.

ఇక తన బౌలింగ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానన్న హార్దిక్‌.. జట్టుకు అవసరమైన సమయంలో కచ్చితంగా తన సేవలు అందిస్తానని పునరుద్ఘాటించాడు. వరుస విజయాల నేపథ్యంలో జట్టులో ఉత్సాహం నిండిందని, తమ విజయాల వెనుక సహాయక సిబ్బంది శ్రమ కూడా ఉందంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 40: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్లు
ఎస్‌ఆర్‌హెచ్‌- 195/6 (20)
గుజరాత్‌ టైటాన్స్‌- 199/5 (20)

చదవండి👉🏾Rashid Khan: నాలుగు సిక్సర్లు.. అది స్నేక్‌షాట్‌.. ఇలా ఎందుకు అన్నానంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement