IPL 2022: లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్‌​ టైటాన్స్‌ కీలక ప్రకటన! | IPL 2022: Gujarat Titans Appoints Rashid Khan As Vice Captain Video | Sakshi
Sakshi News home page

IPL 2022: లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్‌​ టైటాన్స్‌ కీలక ప్రకటన! ఇకపై..

Published Mon, Mar 28 2022 8:47 AM | Last Updated on Mon, Mar 28 2022 3:02 PM

IPL 2022: Gujarat Titans Appoints Rashid Khan As Vice Captain Video - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు (PC: Gujarat Titans Twitter)

IPL 2022- Gujarat Titans: ఐపీఎల్‌-2022తో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న గుజరాత్‌ టైటాన్స్‌ మార్చి 28న మరో కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో తొలిసారిగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక​ మెగా ఈవెంట్‌లో ఆరంభ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కీలక ప్రకటన చేసింది. అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ను తమ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తమ జట్టును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘రషీద్‌ భాయ్‌ మన వైస్‌ కెప్టెన్‌’’ అని పేర్కొన్నాడు. కాగా మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ వదిలేయగా గుజరాత్‌ అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నా తనదైన రోజున చెలరేగే హార్దిక్‌ ఆటతీరుపై విశ్వాసంతో 15 కోట్లు చెల్లించి అతడిని దక్కించుకుంది. సారథిగా నియమించింది. అదే విధంగా రషీద్‌ ఖాన్‌ను సైతం 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 

చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్‌.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!
IPL 2022 MI Vs DC: అనామక బ్యాటర్స్‌తో అసాధ్యమే! మ్యాచ్‌ చేజారిందని అనుకున్నాం.. కానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement