విఫలమైన సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్
ముంబై: ఐపీఎల్-10లో ముంబైతో వాంఖడే స్టేడియంలో జరుగుతున్నమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లకు 8వికెట్లు కోల్పోయి158 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, శిఖర్‌ధావన్‌లు 81 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఈ స్థితిలో జట్టు ముంబైకి భారీ లక్ష్యాన్ని ఇస్తుందనుకున్న తరుణంలో 81 పరుగుల వద్ద దూకుడు మీద ఉన్న వార్నర్(49)ను హర్భజన్ ఔట్ చేశాడు.
ఆ వెంటనే దీపక్ హుడా(9) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. బజ్జీ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర పొలార్డ్‌కు దొరికిపోయాడు. కొద్ది సేపటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ధావన్ (48) వికెట్ కోల్పోవడంతో మిగతా బ్యాట్స్‌మన్‌లు క్యూ కట్టారు. బెన్ కట్టింగ్ దాటిగా ఆడడానికి ప్రయత్నించి 20 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో చెలరేగిన యువరాజ్ (5) నిరాశ పరిచాడు. నమాన్ ఓజా(9), రషీద్‌ఖాన్(2), శంకర్ (1)లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేయలేక పోయింది. ఇక ముంబై బౌలర్స్‌లో బుమ్రా 3, హర్భజన్ 2, మలింగ, పాండ్యా, మిచెల్ మెక్లిగాన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో 49 పరుగులు చేయడంతో వార్నర్‌కు ఆరేంజ్ పర్పుల్ క్యాప్ లభించింది.