Arvind Kejriwal Said Congress Hope for BJP Not Goa People - Sakshi
Sakshi News home page

ఏడుపు ఆపండి సార్‌! బీజేపీకి కాంగ్రెసే ఆశాకిరణం!

Published Mon, Jan 17 2022 4:53 PM | Last Updated on Mon, Jan 17 2022 7:36 PM

Arvind Kejriwal Said Congress Hope For BJP Not Goa people - Sakshi

కాంగ్రెస్‌ అనేది బీజేపీకీ ఆశాకిరణమే తప్ప.. గోవా ప్రజలు కాదు అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి చిదంబరం ట్విట్టర్‌లో సోమవారం చేసిన పోస్ట్‌కి ప్రతిస్పందనగా కేజ్రీవాల్‌ ఈ కౌంటర్‌ ఇచ్చారు.
 

ఆప్‌, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చి.. బీజేపీని గెలుపునకు కారణమవుతున్నాయని కేజ్రీవాల్‌ చెబుతున్నారంటూ చిదంబరం ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆప్‌ నేత కేజ్రీవాల్‌ ‘ఆ ఏడుపు ఆపండి సార్‌.. ఇప్పటికే 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీలోకి  చేరిపోయారు’’ అంటూ ఘాటుగా స్పందించారు. తద్వారా కాంగ్రెస్‌కి పడాల్సిన ప్రతి ఓటు బీజేపీకి ఖాతాలో పడిపోతుందంటూ వ్యాఖ్యానించారు.

పైగా బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌కి రావల్సిన ప్రతి ఓటు సురక్షితంగా బీజేపీ ఖాతాలో పడిపోవడం ఖాయం కాబట్టి కాంగ్రెస్‌నే గెలిపించండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేజ్రీవాల్‌.  ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌, గోవాలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

(చదవండి: దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement