పనాజీ : దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పోరు రసవత్తరంగా మారింది. పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా.. మరి కొన్నిచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ సత్తా చాటేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విభిన్న ఎత్తుగడులతో అధికార పార్టీలను ఇరుకున పెడుతున్నారు.
తాజాగా గోవా రాజకీయ పరిణామాలపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర‍్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 10న గోవా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మార్చి 11వ తేదీన కాంగ్రెస్ నుంచి నేతలందరూ బీజేపీలో చేరుతారని అన్నారు. కాబట్టి బీజేపీ ఓడిపోవాలని కోరుకునే గోవా ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నాను.. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు, వారి ఓటు వృధా అవడమే కాకుండా అది బీజేపీకే వెళ్తుందని తెలిపారు.
మీ ఓట్లన్నీ ఆప్‌కి వేయండని గోవా ప్రజలను కేజ్రీవాల్ కోరారు ఈ క్రమలోనే తాము అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆరో నెలల్లోనే రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో గోవాలో మైనింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా గోవాలో సోమవారం (ఫిబ్రవరి 14న) ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
After results are announced on March 10, by March 11 all from Congress will join BJP. So I appeal to the people of Goa who want to see the BJP lose, don't vote for Congress. Their vote will go wasted, it will go to the BJP. Give all your votes to AAP: Arvind Kejriwal, AAP pic.twitter.com/zqgReiAoUv
— ANI (@ANI) February 12, 2022
Comments
Please login to add a commentAdd a comment