న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన న్యాయవాదితో ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం సీబీఐ అధికారులు ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు తన హయాంలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడంపై చిదంబరాన్ని దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం చిదంబరం స్పందిస్తూ.. ‘విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పత్రాల ఆధారంగానే ప్రశ్నలు, జవాబులు సాగాయి. కాబట్టి చాలా తక్కువ అంశాలను మాత్రమే అధికారులు రికార్డు చేశారు’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment