cbi enqiry
-
నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ‘నీట్’ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడం ఒకటైతే, 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల అంశంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తక్షణమే కేంద్రం స్పందించాలని కోరారు. దీనికి బా ధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెలరోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చి.. ఆ తరువాత మరో వారం రోజులు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరీక్షల ఫలితాలు జూన్ 14వ తేదీ రావాల్సి ఉండగా.. పదిరోజుల ముందుగానే ప్రకటించడం కూడా అనుమానాలు మరింత పెరగడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, గ్రేస్ మార్కులు కూడా ఇష్టానుసారం కలిపారని మంత్రి ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. బొగ్గు గనుల వేలంపై పునరాలోచన చేయాలి.. బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. బొగ్గు గనులను సింగరేణి ద్వారానే ఏర్పాటు చేయాలని, కానీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాత్రం ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు చెబుతున్నారని మంత్రి విమర్శించారు. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయని, కిషన్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.బొగ్గు గనుల అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి మాట్లాడతారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచన చేసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఒక్కసీటు కూడా రాదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. జీవో 46పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
ఆర్యన్‌ని జైల్లో పెట్టొద్దు! సమీర్ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్ షాట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టులో సీనియర్ ఆఫీసర్‌గా పేరొందిన నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్ ఖాన్ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్ వాంఖడే శుక్రవారం తనకు షారుక్ ఖాన్‌కి మధ్య జరిగిన చాట్ల సంభాషణను కోర్టుకి సమర్పించారు. అంతేగాదు షారూఖ్ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్ సంభాషణ గురించి పిటిషన్లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్ షాట్లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్ తనకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించారు. అందుకు సమీర్ సమాధానంగా షారూక్ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్ డైరెక్టర్. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్‌షాట్ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 (చదవండి: సిన్సియర్ సమీర్ వాంఖడే.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్లు?!) -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం సాక్షి మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు (కలెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది). ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్‌పై విచారణ కొనసాగుతోంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం
ముంబై: బాలీవుట్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం తొలిసారిగా సీబీఐ ముందు హాజరైంది. సీబీఐ ఆమెను 10 గంటలపాటు విచారించింది. సుశాంత్‌ను ప్రియురాలు రియా మానసికంగా వేధించారని, అతని అకౌంట్ల నుంచి డబ్బు తీసుకున్నారని రాజ్‌పుత్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. గురువారం రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ప్రశ్నించిన సీబీఐ... ఇద్దరి వాంగ్మూలాల్లో తేడాలను పరిశీలించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రియాను సీబీఐ అడిగిన ప్రశ్నలిలా ఉన్నాయి. ► సుశాంత్ మరణం గురించి మీకెవరు చెప్పారు. అప్పుడు మీరెక్కడ ఉన్నారు. ► మరణవార్త తెలిసిన వెంటనే బాంద్రా ఫ్లాట్‌కు వెళ్లారా? లేకపోతే... ఎందుకు వెళ్లలేదు? ఎప్పుడు, ఎక్కడ సుశాంత్ మృతదేహాన్ని సందర్శించారు. ► అంతకుముందు వరకు కలిసి నివసించిన మీరు జూన్ 8వ తేదీన సుశాంత్ ఫ్లాట్‌ను వదిలి ఎందుకు వెళ్లారు? ► మీరు అలా వెళ్లిపోవడానికి ఏదైనా గొడవ కారణమా? ► వెళ్లిపోయిన తర్వాత జూన్ 9 – 14 మధ్యలో సుశాంత్‌తో మాట్లాడారా? ఏ విషయంపై మాట్లాడారు. ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు అతనితో కాంటాక్ట్‌లో లేరు? ► మరోవైపు సుశాంత్ ఈ రోజుల్లో మీకేమైనా కాల్స్, మెసేజ్‌లు చేశాడా? మీరు వాటిని పట్టించుకోలేదా? కాల్స్‌కు బదులివ్వకపోతే... ఎందుకలా చేశారు? ► సుశాంత్ ఆరోగ్య సమస్యలేమిటి? ఏ డాక్టర్లు, మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకున్నాడు? ఏయే మందులు వాడుతుండేవాడు? -
సరైన నిర్ణయం
మరణమే విషాదకరమైనదనుకుంటే అది వివాదస్పదమైనప్పుడు మరింత బాధిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొన్న జూన్ 14న చనిపోయాక జరిగింది అదే. ఈ ఉదంతంపై అనేకులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు చేయిస్తామని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది గనుక అటువంటి వారందరికీ ఉపశమనం దొరుకుతుందని భావించాలి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యని కుటుంబసభ్యులు, మరికొందరు అంటుంటే... బాలీవుడ్‌ను శాసిస్తున్న కొందరు ప్రముఖులు అతన్ని అవమానించి, అతనికి అన్నివిధాలా అవరోధాలు సృష్టించి ఆత్మ హత్యకు ప్రేరేపించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు కోరుకుంటున్నట్టు సీబీఐ దర్యాప్తు జరపడమే సరైన నిర్ణయం అనడంలో సందేహం లేదు. చలనచిత్ర పరిశ్రమతో సంబంధం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాలీ వుడ్లో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం మాటలు కాదు. ప్రతిభాపాటవాలు పుష్కలంగా వుంటే తప్ప ఎంతమాత్రం సాధ్యం కాదు. సినీ పరిశ్రమ కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడి వున్న రంగం. దాంతోపాటు బంధుప్రీతి కూడా అక్కడ అధికమే. అలాంటిచోట సుశాంత్ తనేమిటో నిరూపించుకున్నాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారూ, భిన్న సందర్భాల్లో ఆయన్ను దగ్గరగా చూసినవారూ ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైన దని, మానవీయత గుండె నిండా నింపుకున్న వ్యక్తని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి తన మరణ కారణం గురించి క్లుప్తంగానైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే వారెవరూ సమాధానపడలేక పోతున్నారు. సుశాంత్ మరణంపై ఇన్నిరోజులుగా సాగిన వివాదం అవాంఛనీయమైనది. కుటుంబసభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేసిన వెంటనే వారికి సంతృప్తికలిగే విధంగా తగిన దర్యాప్తునకు ఆదేశించివుంటే ఈ వివాదం ఇలా ముదిరేది కాదు. సుశాంత్‌ది బలవన్మరణమైతే అందుకు కారకు లెవరో నిర్ధారించి, వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది హత్యే అయితే దుండగుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని తగిన శిక్ష పడేలా చూడాలని ఆశి స్తారు. ఆత్మహత్య లేదా అసహజమైన మరణం జరిగినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఆకస్మిక మరణంగా నమోదు చేస్తారు. ఆత్మహత్యగా కనబడితే ఎలాంటి లేఖ అయినా వదిలివెళ్లారా లేదా అనేది చూస్తారు. మరణించినవారి సన్నిహితుల్ని, సమీప ప్రాంతాల వారిని పోలీసులు ప్రశ్నిస్తారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. పోస్టుమార్టం జరిపించి మృతుల శరీరంపై గాయాలే మైనా వున్నాయా అన్నది పరిశీలిస్తారు. వుంటే ఏ రకమైన వస్తువు లేదా ఆయుధంతో దాడి జరిగి వుంటుందో అంచనాకొస్తారు. మరణించినవారు ఏ లేఖ వదిలి వెళ్లకపోతే, సన్నిహితులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోతే ఏసీపీ స్థాయి అధికారి ఆ దశలోనే కేసును మూసి వేస్తారు. హత్యగా భావిస్తే ఐపీసీ 302కింద, ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలొస్తే ఐపీసీ 306కింద కేసు నమోదు చేస్తారు. ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నగరానికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే బిహార్ పోలీసుల కథనం మరోలా వుంది. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తి ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందని కుటుం బసభ్యులు ఆరోపించారని వారు చెబుతున్నారు. అందువల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్నారు. 2013నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వారు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి ఉదంతం జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలి. వారలా చేయకుండా దర్యాప్తు కోసం ముంబై వెళ్లారు. అయితే వారిపట్ల ముంబై పోలీసుల ప్రవర్తన కూడా సరిగా లేదు. ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరినో కాపాడటమే ధ్యేయంగా అడుగులేస్తున్నారని వస్తున్న ఆరోపణల్ని బలపరిచే రీతిలో వారు అతిగా ప్రవర్తించారు. దర్యాప్తు కోసం వచ్చిన బిహార్ సీనియర్ ఐపీఎస్ అధి కారిని 14 రోజులు క్వారంటైన్లో వుండాలని శాసించి దిగ్భ్రాంతిపరిచారు. అంతేకాదు... పోస్టు మార్టం నివేదిక అడిగినా ఇవ్వలేదు. ఏమైతేనేం మొత్తానికి సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు త్వరలో మొదలవుతుంది. అయితే ఈ ఉదంతంలో భిన్న వర్గాలు స్పందించిన తీరు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని చానెళ్లు ఈ ఉదం తంపై క్యాంపెయిన్ నడిపాయి. కొందర్ని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పులిచ్చాయి. ఇతరులు సరేసరి. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎవరికైనా అనుమానాలుండటం తప్పేమీ కాదు. కానీ ఆమె దోషిగా నిర్ధారణ అయినట్టే భావించి ఆమెను, ఆమె స్వరాష్ట్రమైన బెంగాల్ మహిళలను దూషిం చడం... నిజమో కాదో తేలకుండానే కోట్లాది రూపాయలు రియా కైంకర్యం చేసిందని ఆరోపించడం అనాగరికం. ముంబైలో మానవత చచ్చిపోయిందని, ఇది సురక్షితమైన ప్రాంతం కాదని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య ట్వీట్ చేయడం కూడా పెను వివాదం రేపింది. ముంబై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆగి, వారు తేల్చేదేమిటో చూశాక మాట్లాడితే వేరుగా వుండేది. బిహార్‌కు చెందిన అన్ని పార్టీలూ దీన్ని బిహారీల ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బగా చూశాయి. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి గనుకే ఈ పార్టీలన్నీ ఈ స్థాయిలో స్పందించాయని, ఫిర్యాదు చేయా లంటూ సుశాంత్ కుటుంబసభ్యులపైనా ఒత్తిళ్లు వచ్చాయని కొందరి ఆరోపణ. ఏదేమైనా నిరాధా రమైన ఆరోపణలకూ, అనవసర నిందలకూ ప్రభావితం కాకుండా సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి. కారకులెవరో తేలితే వారెంతటివారైనా కఠిన శిక్ష పడేలా చూడాలి. -
సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ
పట్నా : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) ఇక సుశాంత్ రాజ్‌పూత్ మృతిపై బిహార్‌లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు. కాగా ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి విచారణలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. (తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!) -
చిదంబరాన్ని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన న్యాయవాదితో ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం సీబీఐ అధికారులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు తన హయాంలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడంపై చిదంబరాన్ని దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం చిదంబరం స్పందిస్తూ.. ‘విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పత్రాల ఆధారంగానే ప్రశ్నలు, జవాబులు సాగాయి. కాబట్టి చాలా తక్కువ అంశాలను మాత్రమే అధికారులు రికార్డు చేశారు’ అని ట్వీట్ చేశారు. -
సీబీఐతో విచారణ చేయిస్తేనే నిజాలు తెలుస్తాయి
-
‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’
-
‘చంద్రబాబుపై సీబీఐ విచారణకు ఆదేశించాలి’
సాక్షి, అమరావతి : కాగ్ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లకు ఉపయోగపడే పథకాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బియ్యం సరఫరాలో కుంభకోణం జరిగిందన్న కాగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సుల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని, కాగ్ నివేదికల ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెంచేసి దుబారా ఖర్చులు చేయడం సరికాదని, రోజువారి ఖర్చులకు అప్పుచేసి వృథా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కాగ్ రిపోర్ట్‌లో ఉన్నాయని, ఒక్క రూపాయి కూడా వృథా కాలేదంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు అవాస్తవాలన్నారు. ప్రజాధనాన్ని సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగించాలే తప్ప రోజువారీ ఖర్చులకు కాదని, 2.01 లక్షల కోట్ల రూపాయాల అప్పు రాష్ట్ర ప్రజలపై మోపారని మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం అంకెల గారడిగా వర్ణిస్తూ, సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా టీడీపీ మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్ధులు ఉంటే 1.8 లక్షల మందికి మాత్రమే ఫీజు రియెంబర్స్‌మెంట్ ఇస్తుందని, పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ రాష్ట్ర పభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చులో ప్రభుత్వంపై నమ్మకం లేదని... ఖర్చు చేశామని చెప్తున్నారే తప్ప వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేవన్న కాగ్ నివేదికను గుర్తుచేశారు. కాగ్ రిపోర్టుపై ఏం సమాధానం చెప్తారని చంద్రబాబును ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. -
తుదిదశకు చేరుకున్న సీబీఐ విచారణ
జమ్మికుంట సీసీఐ కొనుగోళ్లలో వెలుగు చూసిన అవినీతి అక్రమార్కుల అరెస్ట్‌కు రంగం సిద్ధం జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో పలుమార్లు విచారణ చేసిన అధికారులు తుదినివేదికను తయారుచేశారు. సీసీఐ అధికారులు వ్యాపారులతో కలిసి అక్రమదందాను కొనసాగించినట్లు సీబీఐ విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఏడాదిన్నర పాటు జరిగి విచారణ తుది దశకు చేరినట్లు సమాచారం. అధికారులు త్వరలో అక్రమార్కులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ.. 2015 పిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలతో సీసీఐ కొనుగోళ్లపై విచారణకు ప్రారంభించిన సీబీఐ అధికారుల పలుమార్లు విచారణ జరిపారు. ఏడేళ్ల పాటు జరిగిన కొనుగోళ్లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తిని విక్రయించిన రైతుల వివరాలు సేకరించారు. రైతులు సాగుచేసిన భూములు, సీసీఐకి విక్రయించిన పత్తి వివరాలను అడిగితెలుసుకున్నారు. బ్యాంక్ ఖాతా బుక్కులు, సీసీఐ చెక్కులు, పట్టదారు పాసు పుస్తకాలు, పహణీ పత్రాలు, సీసీఐ రిజిస్టర్ సంతకాలు, తక్పట్టిలను పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యవసాయం లేకున్న సీసీఐకి పత్తిని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. రైతుల పేరుతో కొందరు ఆడ్తిదారులు బ్యాంకుల్లో ఖాతాలు తెరచి డబ్బులు డ్రా చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. సీసీఐ కొనుగోళ్లలో బీనామి రైతుల దందా జరిగినట్లు సీసీఐ చెల్లింపుల వివరాలతో అధికారులు నివేదిక తయారచేశారు. భయందోళనలో అక్రమార్కులు.. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని సీబీఐ అరెస్ట్‌లు చేస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏడేళ్ల నుంచి పని చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరేవరికి సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఏడేళ్లలో మద్దతు ధరల్లో రైతులను దగా చేయడంలో ఎంత వరకు చేతుల మారాయి. ఏవరేవరికి ఎంత వాట ముట్టింది అనే విషయాలపై సీబీఐ వివరాలను సేకరించింది. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారు విషయం ఆసక్తిగా మారింది.