
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఎస్‌బీఐ రూ.2450 కోట్ల పెట్టుబడితో.. 49శాతం వాటా కలిగి, ఒక్కో షేర్‌కు రూ.10 కన్న తక్కువ పొందడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఎలాగైతే ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభాన్ని ఎల్‌ఐసీ పరిష్కరించలేదో అలాగే యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ఎస్‌బీఐ పరిష్కరించదని పేర్కొన్నారు.
కొన్ని సార్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు వింటుంటే తాను ఆర్థిక మంత్రిగా, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు అనిపిస్తుందని చిదంబరం ఎద్దేవా చేశారు. 2014లో యస్ బ్యాంక్‌కు రుణాలు విడుదల చేసేటప్పుడు ఆర్‌బీఐ యస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఆర్థిక సంస్థల నిర్వహణలో ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చిదంబరం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment