
దేశంలో నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం''.. అన్నారు.
लोकसभा चुनाव के चौथे चरण में आज 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 सीटों पर मतदान हो रहे हैं। मुझे विश्वास है कि इन सभी सीटों पर लोग भारी संख्या में मतदान करेंगे, जिसमें युवा और महिला वोटर बढ़-चढ़कर हिस्सा लेंगे। आइए, अपने कर्तव्य को निभाएं और लोकतंत्र को मजबूत करें!
— Narendra Modi (@narendramodi) May 13, 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఉద్దేశించి.. ''ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను''... అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment