
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏన�...
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మ�...
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ క...
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల�...
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ �...
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజ...
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రత�...
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ...
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యా�...
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల...
న్యూయార్క్: ఇటీవలి కాలంలో బాంబు బెద�...
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనం�...
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
Published Sun, Feb 20 2022 12:46 PM | Last Updated on Sun, Feb 20 2022 4:45 PM
ముంబైకి బయలుదేరిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ముంబై పర్యటన ముగిసింది. శరద్ పవార్‌తో భేటీ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు ముంబై ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.
శరద్ పవార్‌తో సీఎం కేసీర్ భేటీ ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని ముందు నుంచి ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో శరద్ పవార్ సీనియర్ నేత అని అన్నారు. దేశం ప్రస్తుతం సరైన దిశలో ముందుకు వెళ్లడంలేదని తెలిపారు. దళితులకు అభివృద్ధి జరగడం లేదన్నారు. అందుకే దేశం కోసం సరైన ఎజెండా ఉండాలని అన్నారు. దేశంలో అత్యంత అనుభవం ఉన్న నేత శరద్ పవార్ తమతో కలిసి పనిచేస్తానని అన్నట్లు పేర్కొన్నారు. నేతలమంతా మళ్లీ భేటీ అవుతామని చెప్పారు. కొన్ని రోజుల అనంతరం ప్రజల ముందు తమ ఎజెండా విడుదల చేస్తామని తెలిపారు. కార్యచరణ ఏంటో కూడా త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
ఉద్ధవ్ థాక్రేతో భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం పవార్‌తో భేటీ అయ్యారు.
దేశంలో మార్పు రావాలి. దేశాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. అందుకు తమతో వచ్చే వారిని కలుపుకొని పోతామని కేసీఆర్ అన్నారు. మా చర్చల ఫలితాలను త్వరలోనే చూస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ సోదర రాష్ట్రాలు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం. త్వరలో హైదరాబాద్‌లో నేతలందరం కలుస్తామని వెల్లడించారు. దేశంలో అతిపెద్ద పరివర్తన రావాల్సి ఉందన్నారు. దేశ యువతను సరైన దిశలో ముందకు తీసుకెళ్లాలి. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాల్లో కలిసి కట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. ఇద్దరి మధ్య అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, పరస్పర సహాకారం గురించి చర్చించినట్టు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. అన్ని విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.
ముంబైలో మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కార్యాచరణపై చర్చ నడుస్తోంది. అయితే, వారితో భేటీ అవుతున్న బృందంలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీలో భాగంగా సీఎం కేసీఆర్.. కాసేపటి క్రితమే థాక్రే ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వారిద్దరి మధ్య భేటీ ప్రారంభం కానుంది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మమతా బెనర్జీతో, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మరోసారి కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. ఇలావుండగా కేరళ సీఎం పినరయి విజయన్, ఆర్జేడీ నాయకులు తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతోనూ కేసీఆర్ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో భేటీ అయ్యారు. కాగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంపై కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు జనతాదళ్ (సెక్యులర్) అధినేత దేవెగౌడ, మమత, స్టాలిన్ తదితరులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్ధవ్‌తో భేటీ అనంతరం జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా పనిచేసేందుకు కేసీఆర్ ఇప్పటికే రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
అంతకు ముందు కేసీఆర్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ముసుగులో మోదీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తిని దెబ్బతిస్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని మింగేస్తోందని సీఎం ఆరోపించారు. అందులో భాగంగానే దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరుకు బీజేయేతర పార్టీల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ కానున్నారు. వీరి భేటీపై రాజకీయంగా దేశవ్యాప్త చర్య నడుస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో భేటీలో భాగంగా సీఎం కేసీఆర్ ముంబైకి చేరుకున్నారు. మరికాసేపట్లో థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆయనతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, కేకే, బీబీ పాటిల్, రంజిత్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ ఉన్నారు.
దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ కేసీఆర్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బీజేయేతర పార్టీలను కూడగట్టేందుకు గులాబీ అధినేత నేడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వారి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment