ముంబై: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన ముఖ్యమంత్రి సతీమణి అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడిన అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె అకస్మాత్తుగా మంగళవారం అర్ధరాత్రి ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రేకు మార్చ్ 23వ తేదీన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అయితే అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్న ఆమె మంగళవారం అర్ధరాత్రి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు అంటే మార్చి 11వ తేదీన రష్మీ భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. అయినా కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని గుర్తించి వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో రష్మీ ఠాక్రే చేరారు. అంతకుముందు భర్త, సీఎం ఉద్దవ్‌కు, అతడి కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా మళ్లీ కరోనా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment