ముంబై: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరికి వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో కాషాయ పార్టీ ఆయన్ను పక్కకు పెట్టేసిందా అనే ఊహాగానాలు లేవనెత్తుతున్నాయి. కనీసం రెండో జాబితాలో చోటు దక్కనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రతిపక్ష నేత, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నితిన్ గడ్కరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవమానం జరిగితే ఆ పార్టీలో నుంచి బయటకు రావాలని సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో విపక్షాలు విజయం సాధించనున్నాయని ఆశాభవం వ్యక్తం చేశారు.
యవత్మాల్ జిల్లాలోని పూసాద్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేసిన మాజీ కాంగ్రెస్ నాయకుడు(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు) కృపాశంకర్ సింగ్ వంటి వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాషాయ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఉన్నారని... అదే నితిన్ గడ్కరీ పేరు మాత్రం లేదని అన్నారు.
ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం గడ్కరీతో మాట్లాడినట్లు చెప్పారు. ‘మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని అవమానిస్తే.. బీజేపీని వీడి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)లో చేరండి.. మీకు విజయాన్ని మేము అందిస్తాం.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం. అధికారులు కలిగిన పదవి ఇస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష ఎంవీఏలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.
చదవండి: ‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
Comments
Please login to add a commentAdd a comment