బీజేపీది ‘పవర్‌ జిహాద్‌’ పాలిటిక్స్‌: ఉద్ధవ్‌ థాక్రే | Uddav Thackeray Called BJP Indulging In Power Jihad By Breaking Political Parties To Form A Govt | Sakshi
Sakshi News home page

Uddav Thackeray: బీజేపీది ‘పవర్‌ జిహాద్‌’ పాలిటిక్స్‌

Published Sat, Aug 3 2024 5:31 PM | Last Updated on Sat, Aug 3 2024 6:12 PM

Uddav Thackeray Called Bjp Indulging In Power Jihad

పుణె:శివసేన(ఉద్ధవ్‌)పార్టీ అధినేత ఉద్ధవ్‌ థాక్రే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలను చీల్చి బీజేపీ పవర్‌జిహాద్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. పుణెలో శనివారం(ఆగస్టు3) జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉద్ధవ్‌థాక్రే మాట్లాడారు. 

మరాఠాలను పానిపట్టు యుద్ధంలో ఓడించిన ఆఫ్ఘన్‌ రాజు అహ్మద్‌ షా అబ్దాలి వారసుడే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అని విమర్శించారు.  ‘బీజేపీ నేతలు మమ్మల్ని ఔరంగజేబ్‌ ఫ్యాన్‌ క్లబ్‌ అని అంటున్నారు. 

మరి మీరు చేస్తున్నదేంటి పవర్‌ జిహాద్‌ కాదా’అని ఉద్ధవ్‌ ప్రశ్నించారు. ఇటీవల పుణె వచ్చిన అమిత్‌షా మహారాష్ట్రలో  కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌), ఎన్సీపీల కూటమి మహావికాస్‌ అఘాడీని ఔరంగజేబ్‌ ఫ్యాన్‌ క్లబ్‌ అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఉద్ధవ్‌ థాక్రే బీజేపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement