ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోట అయిన నాగపూర్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.
దీనిని గమనించిన ప్రియాంక గాంధీ.. చిరునవ్వుతో స్పందించారు. బుధవారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
गढ़ में घुस कर ललकारना इसे कहते हैं
नागपुर में गरजीं @priyankagandhi
RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024
కాగా బీజేపీ సైద్దాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. దీనిని బీజేపీ కంచుకోటగా పరగణిస్తారు. 2014 నుంచి నాగ్‌పూర్ లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఆరు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.
ఇక మహారాష్ట్ర నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ ఉపఎన్నికతో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20 రోడ్‌షోలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నాగ్‌పూర్ వెస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా.. నాగ్‌పూర్ సెంట్రల్ 2009 నుంచి బీజేపీ చేతిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment