ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బహిరంగసభ
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
ఏడాది పాలనపై ‘ప్రజాపాలన విజయోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 19న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వరంగల్ పర్యటన రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. సభకు వచ్చే మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల చిత్రాలను సభ వద్ద ప్రదర్శించాలని సూచించారు. సీఎం సభ, ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు.
నేడు, రేపు మహారాష్ట్రలో సీఎం ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శని, ఆదివారాల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి చంద్రాపూర్‌లో స్థానిక నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దానియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్‌పూర్‌చేరుకుంటారు. రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నయగావ్, భోకర్, షోలాపూర్‌నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment