బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాడు. వెర్సోవా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు కేవలం 155 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇతడి కంటే నోటాకు ఎక్కువగా 1298 ఓట్లు వచ్చాయి. పైగా ఇతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 56 లక్షలమంది ఫాలోవర్లున్నారు. వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో ఖాన్ విఫలమయ్యాడు.
ఇక వెర్సోవా నియోజకవర్గంలో శివ సేన అభ్యర్థి హరూన్ ఖాన్ 65,396 ఓట్లతో విజయం సాధించాడు. హరూన్ కంటే 1600 ఓట్లు తక్కువ రావడంతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ భారతి లవేకర్ ఓటమిపాలైంది.
సినిమా..
అజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. లకీర్ కా ఫఖీర్, అల్లా కీ బండే, హై తుజే సలాం.. ఇలా ఎన్నో హిందీ చిత్రాల్లో నటించాడు. తెలుగులోనూ రక్తచరిత్ర, దూకుడు, బాద్‌షా, నాయక్, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో విలన్‌గా నటించాడు. బుల్లితెరపైనా పలు సీరియల్స్ చేశాడు. హిందీ బిగ్‌బాస్ 7, 8వ సీజన్స్‌లో పాల్గొన్నాడు. అభ్యంతరకరమైన పోస్టులు, దురుసు వ్యాఖ్యలు, డ్రగ్స్ వల్ల నాలుగుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment