Ajaz Khan
-
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్ ఉవ్విళ్లూరుతున్నారు.అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్‌లపై పోటీకి దిగారు.తన సోషల్ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు. -
4సార్లు జైలుకు.. ఎలుకలు పడ్డ పప్పు తిన్న టాలీవుడ్ విలన్ ఎవరంటే?
ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే నటుడు అజాజ్ ఖాన్. దురుసు వ్యాఖ్యలతో, డ్రగ్స్ వివాదంతో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఈయన కొద్ది నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. 2021లో డ్రగ్స్ కేసులో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా రెండున్నరేళ్లపాటు జైలుజీవితం గడిపాడు. మే 19న బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవల తన అనుభవాలను చెప్పుకొచ్చాడు. 400 మందికి నాలుగే బాత్రూమ్స్ 'ఈ రెండు సంవత్సరాలు నాకెంతో కష్టతరమైనవి. నేను నిజం మాట్లాడాను.. ఫలితంగా దగ్గరివాళ్లే నన్ను దూరం పెట్టారు. 26 నెలలపాటు నా కుటుంబానికి, అనారోగ్యంతో ఉన్న నా తండ్రికి దూరంగా ఉన్నాను. నా కుటుంబం కోసం నన్ను ఇంకా బతికే ఉంచినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదంటే.. ఎండిపోయిన చపాతీలు, రాళ్ల అన్నం తినేవాడిని. 400 మంది ఖైదీలకు నాలుగంటే నాలుగే బాత్రూమ్స్ ఉండేవి. బయటకు వచ్చాక సాధారణ జీవితానికి అలవాటు పడటానికి నెల రోజులు పట్టింది. ఒకరిపై మరొకరు పడుకుంటారు మంచి ఆహారం తీసుకోవడం, శుభ్రమైన బాత్రూమ్లో స్నానం చేయడం.. ఇంకా కొత్తగానే ఉంది. జైలులో ఎలుకలు, పురుగులు పడ్డ పప్పునే తిన్నాను. పురుగులు, కీటకాలతోపాటు నేలపై పడుకునేవాడిని. ఇక్కడ జైళ్లు ఎంత రద్దీగా ఉంటాయంటే.. స్థలం లేక ఒకరిపై మరొకరు పడుకుంటారు. 800 ఖైదీల సామర్థ్యం ఉన్న జైల్లో 3000 మందిని కుక్కుతారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు కూడా ఓ కేసులో జైలుకు వచ్చాడు. కానీ ఏమైంది? సింపుల్‌గా బయటపడ్డాడు. అతడికి, రాజ్‌కుంద్రాకు నేను జైలులో సాయం చేశాను. అయినా ఇప్పుడు దేని గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఒకటే ఆశిస్తున్నాను. నేను నటుడిని, నాకు పనివ్వండి.. నా కుటుంబాన్ని పోషించుకోవాలి' అని అర్థిస్తున్నాడు అజాజ్ ఖాన్. నాలుగుసార్లు కటకటాలపాలు అజాజ్ ఖాన్‌ను తొలిసారి డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 2019 జూలైలో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను అప్లోడ్ చేసినందుకు 2020 ఏప్రిల్‌లో మరోసారి అరెస్టు చేశారు. ఇన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఈ నటుడు 2021 డ్రగ్స్ కేసులో మరోసారి కటకటాలపాలయ్యాడు. ఈసారి మాత్రం కఠిన కారాగార శిక్ష ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది మే 19న బెయిల్‌తో బయటకు వచ్చాడు. అజాజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. అజాజ్ ఖాన్.. లకీర్ కా ఫఖీర్, అల్లా కీ బండే, హై తుజే సలాం, ఫర్కీ రిటర్న్స్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్లో రక్త చరిత్ర, దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేశాడు. అలాగే బుల్లితెరపై.. దివ్య ఔర్ బాతీ హమ్, మట్టి కీ బన్నో, కారమ్ ఆప్నా ఆప్నా.. వంటి అనేక సీరియల్స్‌లో నటించాడు. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 8వ సీజన్లో కూడా కనిపించాడు. చదవండి: ఇస్రో ప్రయోగం.. దేశానికి మీరు గర్వకారణం: మహేశ్‌బాబు -
డ్రగ్స్ కేసులో వివాదాస్పద బాలీవుడ్ నటుడు అరెస్టు
సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్-7 ఫేమ్ అజాజ్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) షాక్ ఇచ్చింది. రాజస్తాన్ నుంచి మంగళవారం ముంబైకు చేరిన ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులో అజాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారి తెలిపారు. మాదకద్రవ్యాల పెడ్లర్ షాదాబ్ బటాటాను ప్రశ్నించినప్పుడు ఖాన్ పేరు వెలుగులోకి రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నగరంలోని అంధేరి, లోఖండ్వాలా ప్రాంతాల్లో ఎన్సీబీ దాడులు చేపట్టింది. అనంతరం అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్సీబీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఖాన్ తనను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని తానే అధికారులను కలవడానికి వచ్చానని పేర్కొన్నాడు. (ఆ ఒక్కమాటతో ఆఫర్ వచ్చింది.. మళ్లీ పనిచేయాలని ఉంది) తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఖాన్‌పై మాదకద్రవ్యాల ఆరోపణలు రావడం మొదటిసారి కాదు. డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు, నోటి దురుసుతో తరచూ చర్చల్లో నిలిచే ఖాన్‌ను జూలై 2019 లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసినందుకు, 2020 ఏప్రిల్‌లో ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను అప్లోడ్ చేసినందుకు అరెస్టు చేశారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అజాజ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చిన ఖాన్ సీజన్ 8లో కూడా కనిపించాడు. అనేక టీవీ షోలతోపాటు, శక్తి చరిత్రా, భోండు, అల్లాహ్ కే బండే, రక్త చరిత్రా 2, హై తుజే సలాం ఇండియా లాంటి సినిమాల్లోనూ నటించాడుఖాన్. -
అతడికి బెయిల్ వచ్చింది..
ముంబై : బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్‌కు బెయిల్ లభించింది. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన ఆరోపణలతో సైబర్ పోలీసులు ఏప్రిల్ 18న అజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ 153(ఏ), 121, 117, 188, 501, 504, 505(2) కింద ఖర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ లైవ్ ఇంటరాక్షన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అతడు మాట్లాడినట్టు ముంబై పోలీసులు ఆరోపించారు. ‘ఒక చీమ చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఒక ఏనుగు చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఢిల్లీలో భూకంపం వచ్చినా ముస్లింలే కారణమంటారు. దేశంలో ఏ ఘటనా జరిగినా ముస్లింల మీదే అభాండం వేస్తారు. అయితే ఈ కుట్రకు ఎవరు కారణమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?’ అని ఫేస్బుక్ లైవ్ ఇంటరాక్షన్‌లో అతడు మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. అజాజ్ ఖాన్ గతంలో కూడా అనేక పర్యాయాలు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్ కేసులో అతడు కటకటాల పాలయ్యాడు. హిందీ బిగ్‌బాస్ 7 సీజన్లో పాల్గొన్న అజాజ్ ఖాన్.. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి -
మరోసారి అరెస్టయిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్
బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ మరోసారి అరెస్టయ్యాడు. ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ముంబై పోలీసులు అతడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. హిందీ బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొన్న అజాజ్ ఖాన్ అటు బాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్‌లోనూ నటించాడు. దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ వంటి పలు చిత్రాల్లో కనిపించాడు. తాజాగా శనివారం నాడు అభిమానులతో ఫేస్బుక్ లైవ్ చేస్తున్న ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. (జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు) కరోనా వైరస్, తబ్లిగి జమాత్ ప్రస్తావన తీసుకువచ్చి ముస్లింలను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలోనూ అజాజ్ ఖాన్‌పై పలుసార్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. గతేడాది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్ కేసులో పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) -
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అరెస్టు
ముంబై : బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్‌ను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను అజాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్ కావడంతో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే అజాజ్ ఖాన్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా అజాజ్ ఖాన్ గతంలో కూడా అనేకమార్లు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... 2018లో డ్రగ్స్ కేసులో ముంబై యాంటీ- నార్కోటిక్స్ పోలీసుల చేతికి చిక్కాడు. ఇక హిందీ బిగ్‌బాస్ 7 సీజన్లో పాల్గొన్న అజాజ్ ఖాన్..పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. -
డ్రగ్స్ కేసులో యంగ్ విలన్ అరెస్ట్
దూకుడు, నాయక్, బాద్షా లాంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్. బిగ్‌బాస్ టీవీ షోతో పాపులర్ అయిన ఈ యువ నటుడు సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో కనిపిస్తుంటాడు. ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఈ అజాజ్ తాజా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. నిషేదిత ఉత్ర్పేరకాలు కలిగి ఉన్న కారణంగా అజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 2.3 గ్రాముల 8 మాత్రలు అజాజ్ దగ్గర ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌లో పాటు 2.2 లక్షల నగదు, సెల్‌ఫోన్స్‌ను కూడా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అజాజ్‌ను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. -
అలీపై 'దూకుడు' ప్రదర్శించిన నటుడు!
న్యూఢిల్లీ: అజాజ్ ఖాన్ .. దూకుడు, నాయక్ సినిమాల్లో విలన్ రోల్ చేసిన ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. అయితే బిగ్ బాస్ షోకు హాజరైన అజాజ్ ఖాన్ దూకుడుగా వ్యవహరించి బహిష్కరణకు గురయ్యాడు. జనవరి మూడో తేదీ నుంచి ఆరంభమైన 'బిగ్ బాస్ హల్లా బోల్' కార్యక్రమానికి అజాజ్ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అలీ ఖలీ మిర్జా- అజాజ్ ల మధ్య చిట్ చాట్ జరిగింది. తొలుత నవ్వులతో మొదలైన వారిద్దరి మధ్య సంభాషణ చివరకు చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో వారిమధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరి ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. ప్రస్తుతం షో రూల్స్ కఠినంగా ఉండటంతో అజాజ్ కు షో నుంచి బయటకు రాక తప్పలేదు. బిగ్ బాస్ -8 లో ఉన్న ఐదు మంది ఛాలెంజర్స్ లో అజాజ్ ఒకడు. నవంబర్ బర్ లో బిగ్ బాస్ -8లో బాలీవుడ్ నటి సోనాలి రౌత్ తన సహనాన్ని కోల్పోయి షో నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో నామినేషన్ లో భాగంగా హాజరైన సోనాలి సహనం కోల్పోయి అలీ చెంప చెళ్లుమనిపించింది.