అలీపై 'దూకుడు' ప్రదర్శించిన నటుడు! | Ajaz Khan asked to exit 'Bigg Boss' house | Sakshi
Sakshi News home page

అలీపై 'దూకుడు' ప్రదర్శించిన నటుడు!

Published Tue, Jan 6 2015 10:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

అలీపై 'దూకుడు' ప్రదర్శించిన నటుడు!

అలీపై 'దూకుడు' ప్రదర్శించిన నటుడు!

న్యూఢిల్లీ: అజాజ్ ఖాన్ .. దూకుడు, నాయక్ సినిమాల్లో విలన్ రోల్ చేసిన ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. అయితే బిగ్ బాస్ షోకు  హాజరైన అజాజ్ ఖాన్ దూకుడుగా వ్యవహరించి బహిష్కరణకు గురయ్యాడు.  జనవరి మూడో తేదీ నుంచి ఆరంభమైన 'బిగ్ బాస్ హల్లా బోల్' కార్యక్రమానికి అజాజ్ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అలీ ఖలీ మిర్జా- అజాజ్ ల మధ్య చిట్ చాట్ జరిగింది. తొలుత నవ్వులతో మొదలైన వారిద్దరి మధ్య సంభాషణ చివరకు చిలికి చిలికి గాలి వానలా మారింది.

 

దీంతో వారిమధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరి ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. ప్రస్తుతం షో రూల్స్ కఠినంగా ఉండటంతో అజాజ్ కు షో నుంచి  బయటకు రాక తప్పలేదు.  బిగ్ బాస్ -8 లో ఉన్న ఐదు మంది ఛాలెంజర్స్ లో అజాజ్ ఒకడు.  నవంబర్ బర్ లో బిగ్ బాస్ -8లో బాలీవుడ్ నటి సోనాలి రౌత్  తన సహనాన్ని కోల్పోయి షో నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో  నామినేషన్ లో భాగంగా హాజరైన సోనాలి సహనం కోల్పోయి అలీ చెంప చెళ్లుమనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement