AP High Court Comments On Bigg Boss Reality Show Over Censor Before Broadcast On TV - Sakshi
Sakshi News home page

AP High Court On Bigg Boss Show: బిగ్‌ బాస్‌ షో.. టీవీ ప్రసారాలకు సెన్సార్‌ లేకపోతే ఎలా?: ఏపీ హైకోర్టు

Published Thu, Jul 27 2023 11:41 AM | Last Updated on Thu, Jul 27 2023 11:58 AM

Ap High Court Comments On Bigg Boss Reality Show - Sakshi

సాక్షి, అమరావతి: టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవ­హారంపై లోతుగా విచారణ జరుపు­తామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.

యువ­తను పెడ­దో­వ పట్టిస్తున్న బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దా­ఖలు చేసిన పిల్‌­పై జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసా­దరావు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖ­లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా­లను, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్‌ వ టీవీ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎండేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, బిగ్‌బాస్‌ షో వ్యాఖ్యా­త అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. స్టార్‌ మా టీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌­రెడ్డి, బిగ్‌బాస్‌ షోను అభివృద్ధి చేసిన ఎండేమోల్‌ ఇండియా లిమిటెడ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తరవు రఘు, పిటిషనర్‌ తరఫున గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు.

చదవండి: ఇదేమి యాత్ర నాయనా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement