జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఎలాగైనా బీజేపీని అడ్డుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పొత్తు, సీట్ల షేరింగ్‌పై కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంపై నేనషల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టతనిచ్చాడు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్లేందుకు రెండు పార్టీలు అంగీకరించాయని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
కాగా జమ్ముకశ్మీర్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న పర్యటించారు. శ్రీనగర్‌లో పార్టీ శ్రేణులతో వీరు సమావేశం అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలోనూ సమావేశమై పొత్తుల విషయాలు చర్చించారు.
అయితే రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని చూస్తుండగా.. జమ్మూ డివిజన్‌లో ఎన్సీకి 12 సీట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. జమ్మూలోని డివిజన్‌లోని రెండు లోక్‌సభ స్థానం, లఢక్‌లోని ఒకస్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేసింది. కశ్మీర్‌లోని మూడు స్థానాల నుంచి ఎన్సీ మూడు అభ్యర్ధులను నిలబెట్టింది. ఎన్సీ రెండు చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఓటమి చెందింది
ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జమ్ముకశ్మీర్‌కు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్ము డివిజన్‌లో 43 స్థానాలు, కశ్మీర్ డివిజన్‌లో 47 సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న.. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment