దేశంలో లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ ఇప్పటికే అధికారకంగా ప్రారంభించింది.
ఈ క్రమంలో రిజిస్టర్ లేని పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా జమ్మూలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే..
ఇక 2014లో జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎం అయ్యారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణానంతరం ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
2019 జూన్ 18న బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఆగష్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఉంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది, కశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు., ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment