ముంబై:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం తర్వాత 23 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ముంబైలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. గణేష్ కుమార్ యాదవ్ సియోన్-కోలివాడ స్థానంలో పోటీకి దింపింది.
Congress releases another list of 23 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/Cs0cthvcfD
— ANI (@ANI) October 26, 2024
చార్కోప్ నియోజకవర్గం నుంచి యశ్వంత్ సింగ్ , కండివాలి తూర్పు స్థానం నుంచి కలు బధెలియా బరిలోకి దిగారు. అయితే.. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య వివాదంగా మారిన నాగ్‌పూర్ సౌత్ సీటు కాంగ్రెస్‌కు దక్కింది. నాగ్‌పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను ప్రకటించింది.
రెండో జాబితాతో విడుదలతో కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 71 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాలకు నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44. 2014లో బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment