సాక్షి, కరీంనగర్: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. బెయిల్ పేపర్స్ నిన్ననే జైలు సూపరింటెండెంట్‌కు అందిన తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదో చెప్పాలి.
సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్‌కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్‌కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment