MLC Padi Kaushik Reddy Survived A Road Accident At Shankarapatnam Mandal, Details Inside - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి‌కి తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు

Published Mon, Jun 12 2023 11:17 AM | Last Updated on Mon, Jun 12 2023 12:08 PM

MLC Padi Kaushik Reddy survived Road Accident At Shankarapatnam mandal  - Sakshi

సాక్షి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న  బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.

ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. బైక్‌ పైన వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలవ్వగా  ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి వెళ్లిపోయారు. అయితే హైదరాబాద్ నుంచి హుజూరాబాద్‌కు నేడు(సోమవారం) నిర్వహించబోయే 2కే రన్ కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం  చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.   కారు పాక్షికంగా ధ్వంసమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement