
ఏపీకి తీరప్రాంతం ఎంత బలమో.. అంతే బలహీనత కూడా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పోర్టుల్లో కార్యకలాపాలు దేశభద్రతకు ముప్పుగా మారుతున్నాయి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ గంజాయికి అడ్డాగా మారింది. 25వేల కిలోల హెరాయిన్ విశాఖలో దొరికింది. ఒక వందకిలోల ఆర్డీఎక్స్ తీసుకొస్తే ఏంటి పరిస్థితి?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ పోర్ట్ పర్యటనలో హల్ చల్ చేశారు.

నాటకీయ పరిణామాల నడుమ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు నడిసంద్రంలో పట్టుకోగా.. ఇవాళ వాటిని పరిశీలించేందుకు వెళ్లిన పవన్ పర్యటనలో అంతే హైడ్రామా నడిచింది

రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు. ఆయన వివరణ ఇవ్వబోతుండగా.. వినకుండా గట్టిగా అరిచారు.

కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు పౌర సరఫరాలు, పోలీసులు, ఆఖరికి పోర్టు అధికారులపై పవన్ చిందులు తొక్కారు

ఆపై బోటులో స్మగ్లింగ్ బియ్యం పట్టుబడ్డ షిప్ దగ్గరకు వెళ్లారు.. ఆ టైంలోనూ కొండబాబును పవన్ వదల్లేదు

ఒడ్డుకు వచ్చాక ప్రెస్‌మీట్‌లో ఆవేశంతో ఊగిపోయిన పవన్

పోర్టు అధికారులకు నోటీసు ఇవ్వండి.. షిప్‌ను సీజ్ చేయండి. పథకాల అమలుకు కిందామీద పడుతుంటే.. ఉచిత బియ్యాన్ని ఇలా దేశాల్ని దాటిస్తున్నారు. : పవన్ రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు మూలాలు చాలా బలంగా ఉన్నాయి. నిన్న రాత్రి రేషన్ బియ్యం పట్టుకోవడంతో నేను వచ్చా. కానీ, నేను వస్తానంటే అసలు రావొద్దని అన్నారు. : పవన్