సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి వర్సెస్ గాంధీ వివాదంలో బీఆర్‌ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్‌లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదా ? అని ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు...సిగ్గు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’అని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హౌజ్ అరెస్టులు
Comments
Please login to add a commentAdd a comment